మోడీ..బాబులను చిత్తు చిత్తుగా ఓడిద్దాం

 గుంటూరు: రాష్ట్రానికి మోసం చేసిన ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్బరాబాబులను వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని, వైయస్‌ జగన్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించాల్సింది బూత్‌ కమిటీ కన్వీనర్లే అని సూచించారు. మీ శ్రమ, మీ కృషి, పట్టుదలే పార్టీ విజయానికి సోపానాలన్నారు. గుంటూరులో నిర్వహించిన వైయస్‌ఆర్‌సీపీ రాజకీయ శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. సుశిక్షితులైన సైనికుల్లా పని చేసి వైయస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. 
 
Back to Top