దుష్ప్రచారం మానుకోండి


– ఎవరితో కలవాల్సిన అవసరం వైయస్‌ఆర్‌సీపీకి లేదు
– నాలుగేళ్ల పాటు బీజేపీ– టీడీపీ కలిసి కాపురం చేశాయి
– ఏ హామీని నెరవేర్చని చంద్రబాబు ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టేస్తున్నారు
– కేంద్రాన్ని తిట్టి రాజకీయ లబ్ధి పొందాలన్నదే బాబు ప్రయత్నం
– ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు
– తన కుమారుడిని సీఎం చేసుకోవాలన్నదే చంద్రబాబు తపన

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎల్లోమీడియా వైయస్‌ఆర్‌సీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీజేపీతో వైయస్‌ఆర్‌సీపీ కలసి పోతుందని విష ప్రచారం చేయడం సరైందని కాదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకున్నారని, వైయస్‌ఆర్‌సీపీకి ఎవరితో కలవాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని చంద్రబాబు గాలికి వదిలేసి, తన కుమారుడిని ముఖ్యమంత్రి చేసేందుకు తాపత్రయపడుతున్నారని విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రకు పునాదులు వేసింది దివంగత ముఖ్యమంత్రి  వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మే మాసంలో మండుటెండర్లలో 50 డిగ్రీల ఎండలో పాదయాత్ర చేశారన్నారు. చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారని, ఆయన ఉదయం మార్నింగ్‌ వాక్‌ మాదిరిగా చేశారని, ఎన్ని ట్యాంకుల నీళ్లు పోశారో అని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన పాదయాత్రలో కూడా చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజల కష్టాలు చూసిన వైయస్‌ రాజశేఖరరెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. చంద్రబాబు అలాంటి పథకాలు ఒక్కటైనా ప్రవేశపెట్టారా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన కుటుంబ సంక్షేమానికే పెద్ద పీట వేశారన్నారు. అవినీతితో విచ్చలవిడిగా డబ్బు సంపాదించారని, ఆ డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేయాలనే దుర్భిద్ది చంద్రబాబుది అన్నారు. ఎలాగైనా తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని ఆరాటపడుతున్నారన్నారు. చంద్రబాబు ఉపన్యాసంలో వైయస్‌ఆర్‌సీపీ, బీజేపీ కలిసిపోతున్నారని ఆరోపించడం బాధాకరమన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, మోడీ కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చారన్నారు. ఇద్దరు కలిసి మెలసి కాపురం చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను, విభజన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. హామీలు నెరవేర్చలేదని ప్రజలు ఆగ్రహంగా ఉండటంతో ఈ నెపాన్ని మోడీపై నెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. రెండు పార్టీలు కూడా ముద్దాయిలే అన్నారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలనే తాపత్రయం ఆయన స్పీచ్‌లో కనిపిస్తుందన్నారు. దీక్షా 420లో కూడా చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలే చేశారన్నారు. ఐదు సంవత్సరాల పాదయాత్ర సందర్భంగా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారన్నారు. మీది స్వయం ప్రకాశమైన పార్టీ కాదన్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారన్నారు. ఎవరితో కలవాల్సిన అలవాటు వైయస్‌ఆర్‌సీపీకి లేదన్నారు. ఉన్నది ఉన్నట్లు చెప్పే మనస్తత్వం కలిగిన వ్యక్తి వైయస్‌ జగన్‌ అన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర తరువాత ఏ ఒక్క వాగ్ధానం చేయకుండా 2009లో ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు. చంద్రబాబుకు అలాంటి ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు అసత్య ప్రచారానికి ఎల్లో మీడియా తోడుగా నిలబడి కలిసి పోతున్నారని విష ప్రచారం చేస్తున్నారన్నారు. సుజనా చౌదరి కేంద్ర మంత్రులతో ఎందుకు రహస్య మంతనాలు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. టీటీడీ పాలక మండలిలో సుదీర్‌ ముంగిటివార్‌ అనే మంత్రి భార్యను బోర్డు మెంబర్‌గా నియమించారన్నారు. వ్యక్తిగతమైన పరిచయాలతో మోడీ కాళ్లపై పడేందుకు ^è ంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. కర్ణాటక ఎన్నికల తరువాత పెద్ద ఎత్తున దాడి జరుగుతుందని చంద్రబాబు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. గవర్నర్‌తో కలిసి వెంటనే చంద్రబాబు స్వరం మారుతుందన్నారు.  పైకి ఘింకరిస్తారు..లోపలేమో కాళ్లు పట్టుకునే స్వభావం చంద్రబాబుదే అన్నారు. ఐవైఆర్‌ కృష్ణారావు, అజయ్‌ కల్లాం ఇద్దరూ కూడా చంద్రబాబు వద్ద పని చేశారని, వీరిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవన్నారు. వారిద్దరు ఇటీవల రెండు పుస్తకాలు రాశారని, అందులో చంద్రబాబు దుష్ట పరిపాలన గురించి ప్రస్తావించారన్నారు. వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు కంగారు పడుతున్నారని ప్రశ్నించారు. దోపిడీలు చేసే నీకు ప్రజల మద్దతు ఉండదని, గుణపాఠం చెబుతారని అంబటి రాంబాబు హెచ్చరించారు.
 
Back to Top