మోదీ కాళ్లు పట్టుకునేందుకు బాబు ప్రయత్నాలు



– చంద్రబాబు దీక్షకు రూ.30 కోట్లు ఖర్చు
– కర్నాటక ఎన్నికల తరువాత ఏం జరుగబోతుందో బాబే చెప్పాలి
– – బీజేపీతో చంద్రబాబు ఇంకా లాలూచీ బేరాలు
– టీటీడీ బోర్డు మెంబర్‌గా మహారాష్ట్ర బీజేపీ నేత భార్య
హైదరాబాద్‌: చంద్రబాబు బీజేపీతో రహస్య మంతనాలు కొనసాగిస్తున్నారని, మళ్లీ మోదీ కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అం» టి రాంబాబు విమర్శించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని నిన్నటి ఆయన ధర్మ పోరాట దీక్షలో కనిపించిందన్నారు. శనివారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు పుట్టిన రోజు ఇంత వైభవంగా ఎప్పుడు జరిగి ఉండదన్నారు. సుమారు రూ.30 కోట్లు వెచ్చించారని విమర్శించారు. ప్రభుత్వ ఖజనాతో రూ.30 కోట్లు వెచ్చించి హడావుడి చేశారన్నారు. గుంటూరు జిల్లాలో 600 ఆర్టీసీ బస్సులు ఉపయోగించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి పై చిలుకు బస్సులు, 500 ప్రవేట్‌ వాహనాలను ఉపయోగించారన్నారు. ప్రత్యేక హోదా కోసం బంద్‌ నిర్వహిస్తే..ఇదే చంద్రబాబు ఆర్టీసీకి రూ.12 కోట్లు నష్టం వచ్చిందని చెప్పినట్లు గుర్తు చేశారు. బంద్‌ల వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పినట్లు తెలిపారు. అభివృద్ధి కుంటుపడుతుందని, ఉద్యమాలు జపాన్‌ తరహాలో చేయాలన్నారు. చంద్రబాబు గారూ..నిన్న మీరు చేసింది పని చేస్తూ చేసిన నిరాహార దీక్షచేశారా అన్నారు. అధికారులందరినీ నీ చుట్టూ కూర్చోబెట్టుకొని ఉద్యమం అని చంద్రబాబు చేసింది ఏమిటీ అన్నారు. ప్రతిపక్షానికేమో ఒకరకమైన నీతి చెబుతారు..మీరు మాత్రం ప్రభుత్వ యంత్రాగాన్ని దుర్వినియోగం చేసి ఇదొక మహా పోరాటం అన్నట్లుగా ప్రచారం చేశారని తప్పుపట్టారు. రాష్ట్రం ఇప్పుడే పుట్టింది..ఇప్పుడే నడుస్తోందని చెప్పిన చంద్రబాబు తన పుట్టిన రోజు ఆడంబరాలకు రూ.30 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేంద్రం సహాయం చేయడం లేదని, విరాళాలు ఇవ్వమని కోరే చంద్రబాబు ఇలా మంచినీళ్ల ప్రాయంగా ప్రభుత్వ ఖజానా ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. నిన్న చంద్రబాబు సుదీర్ఘ ఉపన్యాసం చేశారన్నారు. ఐదు కోట్ల మంది ప్రతినిధిగా నిరాహార దీక్ష చేశానని చెప్పారని, కానీ ఆయన ప్రసంగం ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడారన్నారు. ఏ రాజకీయ పక్షం నీకు మద్దతివ్వలేదన్నారు. ధర్మ పోరాట దీక్ష కాదని, 420 దీక్ష అని, ప్రజలను మోసం చేసే దీక్ష అని మేం పాల్గొనలేదన్నారు. బీజేపీలో రాజకీయ పార్టీలన్నీ కూడా లాలూచి పడ్డాయని అపవాదు మోపి అబద్దాలు చెప్పారన్నారు. చంద్రబాబు తన ప్రసంగంలో ఎక్కడా కూడా విభజన హామీలు నెరవేర్చమన్న స్వరం ఎక్కడా కనిపించలేదన్నారు. ప్రత్యేక హోదా అడగలేదన్నారు. కర్నాటక ఎన్నికలు అయిపోయిన తరువాత నాపై దాడి చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం తనపై చర్యలు తీసుకుంటే నా వెనుకాలా నిలబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారే తప్ప ప్రత్యేక హోదా కోసం ఉద్యమించండి అని పిలుపు ఇవ్వలేదన్నారు. బీజేపీతో ఇంకా చంద్రబాబు లాలూచీ బేరాలు సాగిస్తున్నారని విమర్శించారు. మోదీ మీద తనకు ఎలాంటి వ్యక్తిగత దురాభిప్రాయం లేదని చంద్రబాబు అంటున్నారన్నారు.  మోదీతో, ఆయన తాబేదారులతో చంద్రబాబు ఇంకా రహాస్య మంతనాలు చేస్తునే ఉన్నారని ఆరోపించారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా మహారాష్ట్రానికి చెందిన ఫైనాన్స్‌ మినిస్టర్‌ సుదీర్‌ భార్యను నియమించారన్నారు. బీజేపీకి చెందిన కీలకమైన నాయకుడి భార్యను టీటీడీ మెంబర్‌గా నియమించడం వెనుక ఆంతర్యం ఏంటో అని నిలదీశారు. కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడగకుండా బీజేపీ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 
 
Back to Top