చంద్రబాబు ఓ మాయల్‌ పకీర్‌..పిట్టల దొర


– చంద్రబాబును ఎవరూ నమ్మడం లేదు
– సైకిల్‌ తొక్కితే ప్రత్యేక హోదా వస్తుందా? 
 – హోదాపై వైయస్‌ఆర్‌సీపీకి స్పష్టమైన కార్యాచరణ ఉంది
– రాష్ట్రానికి హోదాతోనే భవిష్యత్తు 
– ప్రత్యేక హోదాపై బాబుకు చిత్తశుద్ధి  లేదు
– హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం
– హోదా కోసం బాబు సైకిల్‌ మాత్రమే తొక్కారు
– సైకిల్‌ తొక్కితే హోదా వస్తుందా?
– రాజధాని నిర్మాణంలో అఖిలపక్షం మీటింగ్‌ పెట్టారా?
 – రాజకీయ క్షేత్రంలో చంద్రబాబు ఏకాకి

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబును ఐదు కోట్ల మంది ప్రజలు నమ్మే పరిస్థితి లేరని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. రాజకీయ పార్టీలతో పాటు, చివరకు బంధువులు కూడా ఆయన్ను నమ్మడం లేదని, రాజకీయ క్షేత్రంలో చంద్రబాబు ఏకాకిగా మిగిలారని ఆయన పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. మొదటి నుంచి కూడా స్పష్టమైన కార్యాచరణతో మేం ముందుకు వెళ్తున్నామన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. బంద్‌లు, ధర్నాలు, ఆమరణనిరాహార దీక్షలు చేశామన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో మా పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి కరువైందన్నారు. చంద్రబాబు కాసేపు హోదా అంటారు. మరి కాసేపట్లో ప్యాకేజీ అంటూ పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు డ్రామాలాడుతున్నారన్నారు. 

ఢిల్లీలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షలు చేస్తుంటే..చంద్రబాబు వెంకటాయపాలెం నుంచి అసెంబ్లీకి ఆరు కిలోమీటర్లు సైకిల్‌ తొక్కారట. అలవాటు లేని వారికి ఆయాసం వచ్చిందట. చంద్రబాబుకు మాత్రం ఆయాసం రాలేదట. ఆయాసం లేకుండా సైకిల్‌ తొక్కి దాన్ని అద్భుతమైన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్‌లో హేమామాలినిని కలుసుకోవడం, పార్లమెంట్‌ మెట్ల వద్ద వంగి ఫొటోలు తీసుకోవడం వంటి అన్నీ కూడా పోరాటంలో అద్భుత ఘట్టాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు బాధకలుగుతుందన్నారు. 

రాష్ట్రానికి సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పార్లమెంట్‌లో కనిపించిన వారందరిని కలుసుకోవడం, ఎంపీలు ఆయనకు సరైన రెస్పాన్స్‌ ఇవ్వకపోవడం బాధకలుగుతుందన్నారు. చంద్రబాబు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు మొదటి నుంచి ప్రత్యేక హోదా కావాలని భిష్మించుకుని కూర్చుంటే ఇంతగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ముందుకు దూసుకెళ్తుంది కాబట్టి చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వారి కంటే ఎక్కువ పోరాటం చేస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారని ధ్వజమెత్తారు. మీడియాలో వార్తల కోసం పోరాటామా? సిగ్గు చేటు అన్నారు. మీడియాలో ఫ్రంట్‌ పేజీలో ఫొటోలు రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పార్లమెంట్‌లో వంగి వంగి దండాలు పెట్టాలా అని నిలదీశారు. 

ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడాలంటే ఐదు కోట్ల మంది ప్రజానీకం తన వెనకాలే ఉండాలని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. నాలుగేళ్లలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలనే ఆలోచన చంద్రబాబుకు వచ్చిందా అని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆనేకమార్లు వివిధ పార్టీలు కోరాయన్నారు. ఎప్పుడైనా చంద్రబాబు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేశారా అని మండిపడ్డారు. ఇటీవల ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లిన కాంగ్రెస్, వామపక్షాలు చంద్రబాబు తీవ్రంగా విమర్శించాయన్నారు. ఇవాళ నిర్వహించిన సమావేశానికి ప్రధాన రాజకీయ పార్టీలు దూరంగా ఉన్నాయని చెప్పారు. 

చంద్రబాబును ఎవరు నమ్మే పరిస్థితి లేదని, ఆయన క్షణక్షణం మాటలు మార్చుతూ మాయల పక్కీర్‌లా వ్యవహరించడమే కారణమన్నారు. వెకిలి చేష్టాలతో పిట్టల దొరలా ఉన్నారు కాబట్టి చంద్రబాబును ఎవరు నమ్మడం లేదన్నారు. దరికి వచ్చిన ప్రతి ఒక్కరిని మోసం చేసే 420 అని గమనించారు కాబట్టి ఎవరూ చంద్రబాబు వద్దకు వెళ్లడం లేదన్నారు. ఐదు కోట్ల మంది ప్రజానీకం నమ్మి ఓట్లు వేస్తే ఈ నాలుగేళ్లు ఏం చేశారని నిలదీశారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచిన మనస్తత్వం చంద్రబాబుది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఎవరు నమ్మే పరిస్థితి లేదని హెచ్చరించారు. రాజకీయ రణక్షేత్రంలో చంద్రబాబు ఏకాకిగా మిగిలిపోతారని అంబటి రాంబాబు హెచ్చరించారు. చివరకు కుటుంబ సభ్యులు కూడా ఆయన్ను నమ్మడం లేదన్నారు. ఎన్‌టీఆర్‌ వద్ద నుంచి లాక్కున్న సైకిల్‌ను తనకు అప్పగిస్తారని ఆయన కుమారుడు లోకేష్‌ ఒక్కరే చంద్రబాబును నమ్ముతారని ఎద్దేవా చేశారు. 

  
 
Back to Top