పెయిడ్‌ ఆర్టిస్టును అరెస్టు చేయాలి


–  ప్రభుత్వ పెద్దల హడావిడిపై అభ్యంతరం లేదు
– చంద్రబాబుకు జరిగిన నష్టమేమిటో ఆ పెయిడ్‌ ఆర్టిస్టు చెప్పాలి
– చంద్రబాబుపై ప్రత్యక్షంగా ఏదో దాడి జరుగుతందని అపోహ  మాత్రమే
విజయవాడ: గత రెండు మూడు రోజులుగా చంద్రబాబు అనుకూల పత్రికల్లో  పెయిడ్‌ ఆర్టిస్టుల ద్వారా హడావిడి చేస్తున్నారని, అందులో మాకెలాంటి అభ్యంతరం లేదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. చంద్రబాబుకు జరిగిన నష్టం ఏమిటో ఆ పెయిడ్‌ ఆర్టిస్టు చెప్పాలన్నారు. కొన్ని కులగజ్జి సంఘాలు 

అతి ముఖ్యమైన చాలా ప్రాముఖ్యత కలిగిన అంశాలను ఆంధ్రరాష్ట్ర ప్రజానికానికి వైయస్‌ఆర్‌ సీపీ ఉద్దేశ్యాలను చెప్పదలచుకున్నామన్నారు. 
గత రెండు మూడు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు అనుకూల పత్రికల్లో, ఛానల్స్‌లో పెయిడ్‌ ఆర్టిస్ట్‌ ద్వారా చేస్తున్న హడావిడికి స్పందిస్తూ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు  పెయిడ్‌ ఆర్టిస్టు నిన్న మా నాయకుడి పేరు ఎత్తాడు కాబట్టి స్పందిస్తున్నామంటూ ప్రకటనలు ఇస్తున్నారన్నారు.  బాబ్లీ ప్రాజెక్టు కేసు నేపథ్యాన్ని కూడా సుధాకర్‌బాబు వివరించారు. నాందేడులో 2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న కాలం. ఎన్నికల లబ్ధి కోసం వేసిన రాజకీయ క్రీడలో భాగంగా బాబ్లీ ప్రాజెక్టుపైన మహారాష్ట్ర అక్రమ కట్టడాలపై అక్కడకు వెళ్లారని చెప్పారు. మా విధులను ఆటంకపరిచారని నీటి పారుదల అధికారులు చంద్రబాబుపై కేసు పెడితే.. ఆ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు చంద్రబాబుకు 33 సార్లు నోటీసులు వచ్చాయన్నారు. అప్పటి నుంచి చంద్రబాబు స్పందించలేదు అని చెప్పారు. అసలు ఆ కేసు స్థాయి ఎంత. ఆ కేసు స్టేషన్‌లో ఎస్‌ఐ అందుబాటులో లేకపోతే హెడ్‌కానిస్టేబుల్‌ బెయిల్‌ ఇచ్చే కేసు అన్నారు. ఆ స్టేషన్‌లోనే బెయిల్‌ తీసుకుంటే కేసు ఉండదన్నారు. రోశయ్య వీరి కోసం ప్రత్యేక హెలికాఫ్టర్‌ పంపించడం.. అది కాంగ్రెస్‌ చంద్రబాబుకు మధ్య జరిగిన లాలూచీ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోవడం లేదని నోటీసులు వేస్తే దానికి స్పందించిన కోర్టు నోటీసులు అందించిందన్నారు. ఆ యువకుడి పిటీషన్‌కు  దీనికి ఆంధ్రరాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటో పెయిడ్‌ ఆర్టిస్టు చెప్పాలని డిమాండు చేశారు. 

కొన్ని కుల గజ్జి సంఘాలు ఏర్పాటు చేసుకున్న గజ్జికుక్క, ఊరకుక్కలను గ్రామాల్లో పిచ్చిపట్టిన తరువాత జనం మీద పడి కరిస్తే బయటకు తరిమి తరిమి కొడతారన్నారు.  నాకు తెలిసిన పెయిడ్‌ ఆర్టిస్టు ఇలాంటి పనే చేస్తే గ్రామం నుంచి వెళ్లగొడితే హైదరాబాద్‌కు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు.  హైదరాబాద్‌లో కూడా ఇలాంటి కార్యక్రమం ఇంకొకటి చేస్తే పాలెం బస్‌ సంఘటనలో ఒక విదేశీయురాలితో అమెరికాలో ఉంటున్నాడంట ఈ గజ్జికుక్క,  కులపిచ్చి పదే పదే కుక్క అనాలనిపిస్తుందో తెలుసా.. మహాత్ముడా అని పెట్టిన నువ్వు పెట్టిన ఎక్స్‌ప్రేషన్స్‌ కొన్ని కోట్ల మంది గుండెలు రగిలించాయన్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నావో స్పృహలో లేకుండా నీ స్థాయిని అంచనా వేసుకోకుండా అదుపు లేకుండా మాట్లాడావు కాబట్టి కుక్క బొమ్మ గీసిన తరువాత కుక్క పేరు రాయమంటే ఎలా చెబుతారన్నారు.  గరుడు ఎవరు ఆపరేట్‌ చేస్తున్నారో కేంద్రంలో చెబితే ఆ గజ్జికుక్క పేరు నేను చెబుతా అన్నారు. ఎవరు ఇతనికి సమాచారం ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎందుకు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయన్నారు.  ఆ పేర్లను ఎందుకు మీడియా ముందు పెట్టడం లేదని నిలదీశారు. పెయిడ్‌ ఆర్టిస్టు పదే పదే చెబుతుంటే ఎందుకు కేసులు బనాయించడం లేదన్నారు.  ప్రభుత్వం నిద్రపోతుందా.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు.  కేసుల ఆగ్రహజ్వాలలు అంటున్నారు. ఎవరికి వచ్చింది ఆగ్రహం తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే సానుభూతి పొందాలని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర మొత్తం కుట్రలతో కూడుకున్నదే అని విమర్శించారు. ఏపీ అనే చేనులో అడ్డంగా తిని బలిసిన పెయిడ్‌ ఆర్టిస్టు ఇచ్చే సమాచారానికి స్పందించడం,  మీడియాలో ఒక పథకం ప్రకారం ప్రచారం చేయడం దారుణమన్నారు. చంద్రబాబుపై ప్రత్యక్షంగా ఏదో దాడి జరుగుతందని అపోహ సృష్టించి మీడియా ద్వారా ప్రజల దృష్టి మరల్చాలని కుట్ర చేశారన్నారు. ఇక మీ ఆటలు సాగవని హెచ్చరించారు.


జగన్‌కు అనుకూలంగా సర్వేలు ఉండటంతోనే..
వ్యూహాత్మకంగా ఎందుకు ప్రచారం తెచ్చారంటే జాతీయ మీడియాలో 43 శాతంతో వైయస్‌ జగన్‌ కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి అని వార్త వచ్చింది కాబట్టే దానికంటే ముందుగానే కౌంటర్‌ వ్యూహంతో బాబును మహాత్ముడిలా చూపించే ప్రయత్నం జరుగుతుందన్నారు.  

ఆపరేషన్‌ గరుడ అంటే ఏంటీ.. 
మహాత్ముడిలా కనిపించాడా.. దేశంలో ఐటీ సామ్రాజ్యాన్ని నిర్మించింది చంద్రబాబా.. తెలంగాణలో వెళ్లి చెప్పు ఇంకో బజారు మారు.. ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టించాలని చూస్తున్నావు.  కుట్ర అంటే ఎలా ఉంటుందంటే రాజధాని పేరుతో 33 వేల ఎకరాలు తీసుకొని భూముల కంటే ముందు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసి సింగపూర్‌ కంపెనీలకు అవి కేటాయిస్తే ఎలా ఉంటుందో అది కుట్ర అంటారన్నారుæ. పోలవరంలో రూ. 112 కోట్లు ట్రాన్స్‌రాయి కంపెనీకి అదనంగా చెల్లించి మీరు పంచుకుంటే ఎలా ఉంటుందో కుట్ర అలా ఉంటుందని వివరించారు. హుద్‌ హుద్‌ తుపాన్‌లో విశాఖ అల్లకల్లోలం అయితే.. రికార్డులు మాయమయ్యాయని దొంగ నాటకం ఆడితే ఎలా ఉంటుందో కుట్ర అలా ఉంటుందని చెప్పారు. నీ అభిమాన నాయకుడిని అడుగు.. ఏ పార్టీతో.. ఎవరితో సంబంధం లేదని చిట్టచివరికి మీ నాయకుడు చంద్రబాబు అని ఒప్పుకున్నందుకు సంతోషం అన్నారు. 
నీ ద్వారా ఆడించిన దొంగ నాటకాలు.. ఆహా టీవీ.. ఓహో టీవీలు  అన్ని కలిసి నిన్ను వాడుకుంటున్నారన్నారు. వీరంతా బైరన్నర్‌లా వాడుకుంటున్నారు. ఆపరేషన్‌ గడబిడ వ్యవహారంలో స్పష్టత కావాలి. సూటిగా అడుగుతున్నాం. ఫెయిడ్‌ ఆర్టిస్టు్టను అరెస్టు చేయండి. అతని ఫోన్‌కాల్‌ లిస్టును బయటకు తీయండి. అతడు ఎందుకు అమెరికా వెళ్తున్నాడో.. ఏ టీవీకి సంబంధించిన స్లాగ్స్‌ అప్పనంగా దొరుకుతున్నాయో ఆ టీవీ అధినేత ఎవరో బయటకు తీయాలని సుధాకర్‌బాబు డిమాండు చేశారు. బీజేపీని కూడా అడుగుతున్నాం. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఎవరు సమాచారం ఇస్తున్నారని ప్రశ్నించారు. 

రెక్కీ ఏంటీ?
గుంటూరులో వైయస్‌ జగన్‌పై ఎక్కడ రెక్కీ జరిగిందో చెప్పాలని సుధాకర్‌బాబు పట్టుబట్టారు. ఇంకో దగ్గర దాడి జరుగుతుందంటున్నారు. ఆ వివరాలు కూడా తెలియజేయాలని సూచించారు. ప్రతిపక్ష నాయకుడు పది నెలల నుంచి ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. జననేతపై వీరంతా కుట్ర చేస్తారేమోనని భయంగా ఉందన్నారు. 24 గంటల్లో పెయిడ్‌ ఆర్టిస్ట్‌పై చర్యలు తీసుకోవాలని సుధాకర్‌బాబు డిమాండు చేశారు.  

 
Back to Top