రాత్రి బీజేపీ..పగలు కాంగ్రెస్‌తో బాబు కాపురం
–ఇరిగేషన్‌ మంత్రికి వాకింగ్‌ ట్రాక్‌ కోసం రూ.7 కోట్లు ఖర్చు
– మంత్రి యనమల రామకృష్ణుడు రూట్‌ కెనాల్‌ ట్రిట్‌ మెంట్‌కు రూ.2.88 లక్షలు
–మంత్రికో నిబంధన..సామాన్య ప్రజలకు ఇంకో నిబంధనా?
– కృష్ణా డెల్టా కాల్వ మరమ్మతులకు సరిపడ డబ్బులు కేటాయించడం లేదు
– బాబుకు స్వార్థ ప్రయోజనాలే తప్ప..ప్రజా సమస్యలు పట్టవు
  
విజయవాడ: ప్రచార ఆర్భాటాల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సొమ్మును దుబారా ఖర్చు చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి విమర్శించారు. ఈ ప్రభుత్వంలో మంత్రులకు  ఒక నిబంధన, సామాన్య ప్రజలకు ఇంకో నిబంధనా ఉందని మండిపడ్డారు. రాత్రి బీజేపీ, పగలు కాంగ్రెస్‌తో చంద్రబాబు కాపురం చేస్తున్నారని ఆయన ఫైర్‌ అయ్యారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్థసారధి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 
ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టుల అంచనాలు పెంచి ఆ డబ్బులను దొడ్డిదారిలో సింగపూర్‌కు తరలించడం, జేబులో వేసుకోవడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. చివరి వరకు నిద్రపోతున్నట్లు నటించి, అర్జెంట్‌గా కావాలని, వెంటనే అయిపోవాలని కొన్ని ప్రాజెక్టులను 20, 30 శాతం బొనస్‌గా ఇచ్చి ఆ సొమ్మును కొల్లగొట్టడం జరుగుతుందన్నారు. లేని ప్రతిష్టతను ఉన్నట్లుగా చూపించడం కోసం పుష్కరాలు, మహిళా పార్లమెంట్‌ సమావేశాలు, పునరంకిత సభలు అంటు అర్భాటాలు చేయడం జరుగుతుందన్నారు. విలాసవంతంగా జీవించేందుకు ప్రజల సొమ్మును ఇష్టరాజ్యంగా దురాబా చేస్తున్నారన్నారు. కృష్ణా డెల్టాను ఆధునీకరరించేందుకు, చివరి భూములకు నీరు అందించేందుకు వైయస్‌ రాజశేఖరరెడ్డి పనులు ప్రారంభిస్తే..ఈ ప్రభుత్వం రూ.250 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఈ నిధులను దేవినేని అధికార నివాసం కోసం, కుటుంబ సభ్యుల విలాసం కోసం ఖర్చు చేశారన్నారు. మార్నింగ్‌ వాక్‌ కోసం రూ. 7 కోట్లతో ట్రాక్‌ ఏర్పాటు చేసుకోవడం దుర్మార్గమన్నారు. అలాంటి మంత్రిని దేనితో కొట్టినా కూడా తప్పు లేదన్నారు. ప్రజలకు అవవసరమైన చోట ఖర్చు చేయకుండా, వాకింగ్‌ ట్రాక్‌ కోసం రూ.7 కోట్లు ఖర్చు చేయడం బాధ్యతారహితానికి నిదర్శనమన్నారు. 
– ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రూట్‌ కెనాల్‌ ట్రిట్‌మెంట్‌ కోసం లక్షలు ఖర్చో చేశారని పార్థసారధి విమర్శించారు. మన రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఈ రూట్‌ కెనాల్‌ చేస్తున్నారన్నారు. అలాంటిది యనమల రామకృష్ణుడు సింగపూర్‌లో రూ 2.88 లక్షలు ఖర్చు చేయడం సిగ్గు చేటు అన్నారు. ఉద్యోగులు మెడికల్‌ బిల్లు పెడితే  అందులో సగానికి సగం కోత విధించి నెలల తరువాత విడుదల చేసే ఈ ప్రభుత్వం మంత్రి రూట్‌ కెనాల్‌కు లక్షలు ఖర్చు చేయడం దుబారాకు నిదర్శనమన్నారు. 
– ముఖ్య మంత్రి చంద్రబాబు మన దేశంలోని ఇంజనీర్లు మురికికాల్వలు కట్టడానికి కూడా పనికి రారని హేళనగా మాట్లాడితే..యనమల మన రాష్ట్రంలో రూట్‌ కెనాల్‌ చేయలేరని భావించి సింగపూర్‌ వెళ్లి ట్రిట్‌ మెంట్‌ చేయించుకున్నారన్నారు. 
– నిమ్స్‌ అన్నది ప్రభుత్వ సంస్థ అని, అక్కడ మంచి వైద్య వసతులు ఉన్న ఆసుపత్రి అన్నారు. అక్కడ వైద్యం చేయించుకుంటే రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం సింగపూర్‌లో రూట్‌ కెనాల్‌ చేయించుకుంటే ఎలా డబ్బులు చెల్లించారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో పేదవారికి ఒక న్యాయం, టీడీపీ నేతలకు మరో న్యాయమా అని నిలదీశారు. ప్రజల సొమ్ము రూ.6 వేల కోట్ల డబ్బులు చంద్రబాబు ప్రభుత్వం దుబారా చేసిందని మా నాయకుడు ఇటీవలే చెప్పారని పార్థసారధి గుర్తు చేశారు.
– ఎన్నికల సమయంలో మేం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయండి అని అడిగే «ధైర్యం లేక కుట్ర రాజకీయాలతో ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని పార్థసారధి విమర్శించారు. చంద్రబాబు ఏ గ్రామానికైనా వెళ్లి మీ ప్రాంతానికి ఫలాన పని చేశానని చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. నిన్నటి వరకు బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు..ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాత్రి బీజేపీతో, పగలు కాంగ్రెస్‌తో చంద్రబాబు కాపురం చేస్తున్నారని ప్రజలకు అర్థమైందన్నారు. ఆ రోజు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ఆ రోజు చంద్రబాబు మద్దతు ఇస్తే అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేదని, నిన్న రాజ్యసభ డిప్యూటి చైర్మన్‌ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు వేస్తే చంద్రబాబుకు ఎందుకు నిలదీయలేదన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వారితో చంద్రబాబు డ్రామాలాడిస్తున్నారని విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీ బహిరంగంగా మద్దతు తెలుపుతుందని, అందుకే వైయస్‌ జగన్, పవన్, బీజేపీ తమకు శత్రువులని చెబుతున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి లేదని ఫైర్‌ అయ్యారు. హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని, వైయస్‌ జగన్‌తోనే హోదా సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
 
Back to Top