బాబు చెబుతున్న మాటలే బీజేపీ అఫిడవిట్‌లో ఉన్నాయి– బీజేపీ అఫిడవిట్‌ చూసిన రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు
– నాలుగేళ్లు బీజేపీతో కలిసి పని చేసి ఇవాళ చంద్రబాబు డ్రామాలు
– విభజన చట్టంలోని ప్రాథమిక హక్కుపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదు
విజయవాడ: చంద్రబాబు నాలుగేళ్లుగా చెబుతున్న మాటలే ఇవాళ బీజేపీ నేతలు కోర్టులో వేసిన అఫిడవిట్‌లో ఉన్నాయని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి పేర్కొన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబు ఇవాళ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
–  నిన్న ప్రత్యేక హోదాకు సంబంధించి, విభజన  చట్టంలోని అంశాలపై బీజేపీ సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌ చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. బీజేపీకి నైతికత లేదని ఈ అఫిడవిట్‌ను చూస్తే అర్థమవుతుందన్నారు. ఏ పార్టీ అయినా పార్లమెంటరీ వ్యవస్థను గౌరవించకపోతే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ఏపీకి అన్ని చేశామని చెబుతూ వస్తున్నారని, ..ఈ రోజు అఫిడవిట్‌ రూపంలో బీజేపీ కోర్టులో పెట్టిందన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే బీజేపీ నేతలు వారి మాటల్లో నిజాయితీ ఉందని చెబుతున్నారో, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేం డిమాండు చేస్తున్నామన్నారు. లేదంటే తెలుగు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. బీజేపీ అఫిడవిట్‌ చూసి టీడీపీ మంత్రులు సంతోషపడుతున్నారన్నారు. ఈ అఫిడవిట్‌ను చూసి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు. బాబు చెప్పినవే ఇవాళ బీజేపీ కోర్టులో అఫిడవిట్లో రుజువైందన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చంద్రబాబు చెప్పిన మాటలే బీజేపీ చెబుతోందన్నారు. టీడీపీ అసెంబ్లీలో బీజేపీని పొగుడుతూ తీర్మానం చేసిందో ..అదే విషయాన్ని బీజేపీ అఫిడవిట్‌ రూపంలో కోర్టులో సడ్మిట్‌ చేసిందన్నారు. ఒక వ్యక్తి చావుకు కారణమైన వ్యక్తే మందు ఇస్తానని చెప్పినట్లుగా చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసి..ఈ రోజు పోరాటం చేస్తున్నట్లు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. బీజేపీతో జత కట్టే సమయానికి రాష్ట్రానికి సంబంధించిన విభజన చట్టం పార్లమెంట్‌లో ఆమోదం పొందిందన్నారు. ప్రణాళిక సంఘానికి కూడా పంపించారన్నారు. బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నాలుగేళ్లు బీజేపీని ఎందుకు పొగుడుతూ వచ్చారో చెప్పాలని పట్టుబట్టారు. ప్రణాళిక సంఘం అమలులో ఉండగా చంద్రబాబు ఎందుకు వారిని అడగలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. నీతి అయోగ్, 14వ ఆర్థిక సంఘం ఇవ్వడం లేదని ఎందుకు తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఎంత అన్యాయం చేసిందో , అంతేస్థాయిలో టీడీపీ, చంద్రబాబు కూడా వ్యతిరేకంగా ఉన్నారన్నారు. హోదా ఏమైనా సంజీవినా అని ప్రశ్నించారన్నారు. ఈశాన్య రాష్ట్రాలు ఏం లాభం పొందాయని దబాయించారన్నారు. 
– ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలతో పాటు సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌ చూసిన రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు.  ఏపీకి అన్ని చేశామని బీజేపీ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు నాలుగేళ్లుగా చెబుతున్న మాటలే ఇవాళ బీజేపీ నేతలు కోర్టులో వేసిన అఫిడవిట్‌లో  రుజువైందన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు వస్తాయని వైయస్‌ జగన్‌ మొదటి నుంచి చెబుతుంటే..మాపై ఎదురుదాడి చేశారని, అక్రమ కేసులు బనాయించారని గుర్తు చేశారు. ఇవాళ పరిశ్రమలు మూతపడుతున్నాయని, మరోవైపు చంద్రబాబు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నట్లు నాటకాలాడుతున్నారన్నారు. 
– సోమిరెడ్డి చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ టైంపాస్‌ కోసం విమర్శిస్తుందని అనడం దుర్మార్గమన్నారు. ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే..వారికి వెన్నుపోటు పొడిచేందుకు కత్తి ఇచ్చింది మీరు కాదా అని నిలదీశారు. విభజన చట్టంలో ఎన్నికల తరువాత ఆరు నెలల్లో ఏం చేయాలో చాలా స్పష్టం చెప్పారన్నారు. కడప ఉక్కు పరిశ్రమ, గ్రీన్‌ఫీల్డ్‌ పరిశ్రమ, వైజాగ్‌–చెన్నై కారిడారు, రైల్వే జోన్‌ అన్ని కూడా ఆరు నెలలలోపు రాష్ట్రానికి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. విభజన చట్టంలోని ప్రాథమిక హామీని అమలు చేయకపోయినా బీజేపీతో ఎందుకు కలిసి నాలుగేళ్లు పని చేశారని నిలదీశారు. కేంద్ర మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీలు ఒక్క మాటైనా మాట్లాడారా అన్నారు. దుగ్గిరాజుపట్నం 2018లోగా పూర్తి చేస్తామన్నారు. ఈ రోజు వరకు దానికి శంకుస్థాపన కూడా చేయలేదన్నారు. బీజేపీని విడనాడటానికి ముందు జనవరి 13, 2018న చంద్రబాబు ప్రధానిని కలిశారన్నారు. ప్రత్యేక హోదా గురించి అంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అడగలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, బీజేపీ, టీడీపీలకు గుణపాఠం తప్పదని పార్థసారధి హెచ్చరించారు.
 

తాజా ఫోటోలు

Back to Top