చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి


విజయవాడ:   సీఎం హోదా ఉండి చంద్రబాబు బీసీ కులాలను కించపరిచేలా వ్యవహరించడం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. తక్షణమే చంద్రబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండు చేశారు. ఇటీవల హక్కుల సాధనకు సీఎం వద్దకు వెళ్లిన నాయీ బ్రాహ్మణుల పట్ల సీఎం చంద్రబాబు వైఖరి దారుణమని ఆయన మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
Back to Top