వైయస్‌ జగన్‌తోనే రాజన్న రాజ్యం

ప్రకాశం: వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాజన్న రాజ్యం వస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రకాశం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు అహంకార పూరితమైన పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేయాల్సిన చంద్రబాబు వారిని బెదిరిస్తూ దోపిడీలకు, అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో అరాచకం సృష్టిస్తూ ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా చేస్తున్నారన్నారు. వైయస్‌ జగన్ను సీఎం చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 
 
Back to Top