చంద్రబాబుకు చిప్పకూడు తప్పదు

 

 
– సోనియాగాంధీని ఎదురించిన ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌
– పోరాటాలే వైయస్‌ఆర్‌సీపీ పంథా
– దేశంలోనే అత్యధిక మెజారిటీతో ఎంపీగా వైయస్‌ జగన్‌ గెలిచారు. 
 
విజయవాడ:  ముఖ్యమంత్రి చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని, ఆయనకు చిప్పకూడు తప్పదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ హెచ్చరించారు. వైయస్‌ జగన్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలోవెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు.  చివరకు వెంకన్న స్వామి విలువైన నగలు, ఆభరణాలు దోచుకున్నారు కాబట్టి చంద్రబాబుకు వణుకు పుట్టిందన్నారు. సోనియాగాంధీని ఎదురించి వైయస్‌ఆర్‌సీపీ నెలకొల్పిన వ్యక్తి వైయస్‌ జగన్‌ అన్నారు. పోరాటమే మా పార్టీ విధివిధానమన్నారు. చంద్రబాబు మాదిరిగా అవసరాలకు అనుగుణంగా పొత్తు పెట్టుకునే రకం కాదన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబుపై సీబీఐ, ఏసీబీ, ఈడీలు విచారణ చేపడుతారన్నారు. చంద్రబాబుకు చిప్పకూడు తధ్యమన్నారు. పంచాయతీ చైర్మన్‌ అనుభవం కూడా వైయస్‌ జగన్‌కు లేదని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్‌ జగన్‌ దేశంలోనే ఎంపీ స్థానం నుంచి అత్యధిక మెజారిటీ సాధించిన రెండో వ్యక్తి అన్నారు. కేవలం 5 లక్షల ఓట్లతోనే మేం అధికారానికి దూరమయ్యామని గుర్తు చేశారు. 40 ఏళ్ల యువకుడు వైయస్‌ జగన్‌ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సవాల్‌ స్వీకరించలేదన్నారు. లోకేష్‌ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అన్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్‌ అడ్డదారిలో మంత్రి అయ్యారన్నారు. వైయస్‌ జగన్‌ను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఆ నిందను కేంద్రంపై వేసి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఒక్క ఉద్యోగమైనా ఇప్పించావా అని ప్రశ్నించారు. రైతులు, డ్వాక్రా మహిళలను, యువకులను మోసం చేశారని మండిపడ్డారు. కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అడ్డంగా దొరికిపోయిందని చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు. 18 మంది ఎంపీలను చేతుల్లో పెట్టుకొని రాష్ట్రానికి రావాల్సిన ఏ ఒక్కటి తీసుకోరాలేదన్నారు. టీడీపీ నాలుగేళ్ల పానలో అడ్డగోలుగా దోపిడీలకు పాల్పడ్డారని విమర్శించారు. ఇక్కడ దోచుకున్న డబ్బంతా కూడా సింగపూర్, జపాన్, మలేసియా వంటి దేశాల్లో దాచుకుంటున్నారని ఆరోపించారు. చివరకు తిరుమల దేవస్థానంలో స్వామి వారి నగలు కూడా వదలిపెట్టలేదని ధ్వజమెత్తారు.  రాష్ట్రాన్ని అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన వ్యక్తిని నీవు కాదా బాబూ అని నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిపై చంద్రబాబు ఆరోపణలు బాధాకరమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి వైయస్‌ఆర్‌ మాత్రమే అన్నారు. ఆరోగ్యశ్రీని అద్భుతంగా కొనసాగించారన్నారు. నీవు పెట్టిన రూపాయికి కిలో బియ్యం పథకాన్ని విజయవంతంగా కొనసాగించారన్నారు. రాష్ట్రాన్ని ముంచిన చంద్రబాబును ప్రజలు క్షమించరని హెచ్చరించారు. టీడీపీ మహానాడు..మాయనాడు అని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారని, సింగిల్‌గానే ఎన్నికలకు వెళ్తామని వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.
 
Back to Top