బాబు పాలనలో బడుగులకు అన్యాయం

– మేనిఫెస్టోలో వందకు పైగా హామీలు ఇచ్చారు
– హామీల్లో ఎన్ని అమలు చేశారు?
– చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు
– నివేదికలపై సీబీఐ విచారణ జరిపించాలి
విజయవాడ: చంద్రబాబు పాలనలో బడుగులకు అన్యాయం జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నతమైన పోస్టుల భర్తీలో బీసీలను నియమించలేదని మండిపడ్డారు. ఉన్నతమైన పోస్టుపై నిష్పక్షపాతంగా నివేదిక ఇవ్వలేదని దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. బీసీల జీవన ప్రమాణాలు పెంచాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  బలహీన వర్గాలు, దళితుల అవకాశాలకు చంద్రబాబు గండికొట్టారని విమర్శించారు. బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నామని ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. బీసీ డిక్లరేషన్‌లో బలహీన వర్గాలకు ఆశలు చూపారన్నారు. వీటిలో ఏ ఒక్క హామీ కూడా సంతృప్తికరంగా అమలు చేయలేదన్నారు. రూ.10 వేల కోట్లు బీసీ సబ్‌ ప్లాన్‌ చేస్తామన్నారు. ఇందులో ఖర్చు చేసింది రూ.8 వేల కోట్లు మాత్రమే అన్నారు. బలహీన వర్గాలు, దళితుల అవకాశాలకు గండి కొట్టారన్నారు. బీసీ అంటే బాబు గారి క్లాస్‌ అని, తన బినామీల జేబులు నింపుకోవడానికే ప్రయత్నించారన్నారు. ఈ రోజు ఈశ్వరయ్య ఇచ్చిన నివేదికలో వెల్లడైందన్నారు. ఉన్నతమైన పోస్టులపై నిష్పక్షపాతంగా నివేదిక ఇవ్వలేదన్నారు. దీనిపై సమగ్ర విచారణచేపట్టాలని డిమాండు చేశారు. బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారన్నారు. నాయీబ్రహ్మణులకు కత్తెర్లు ఇస్తే సరిపోతుందా అన్నారు. గొ్రరెల కాపురులకు గొ్రరెలు ఇస్తే సరిపోతుందనా అని నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి బలహీన వర్గాలను ఉన్నత స్థితికి చేర్చేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అంతా బాబు గారి క్లాస్‌దే పెత్తనమన్నారు. ఎక్కడా కూడా సామాజిక వర్గాల అ భివృద్ధికి చంద్రబాబు కృషి చేయలేదన్నారు. కాంట్రాక్టర్ల కోసం 2013 నుంచి కూడా రేట్లు పెంచేసి ముడుపులు తీసకున్నారన్నారు. హెయిర్‌ కట్టింగ్‌ సెలూన్లు బాబు గారి క్లాస్‌ వారే పెట్టుకుంటున్నారని, నాయీ బ్రహ్మణులకు సరైన ప్రోత్సాహకం అందడం లేదన్నారు. బలహీన వర్గాలను  అవమాన పరిచే విధంగా కుంగదీసే పద్ధతిలో టీడీపీ ప్రభుత్వం ఉందన్నారు. బలహీన వర్గాలపై ప్రేముంటే వారిని వృద్ధిలోకి తేవాలో ఆలోచించాలన్నారు. జస్టిస్‌ ఈశ్వరయ్య నివేదికలో స్పష్టంగా చెప్పారని తెలిపారు. జడ్జిల నియామకాలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండు చేశారు.  
 
Back to Top