అంకెల్లో బొంకడం టీడీపీకే సాధ్యం

– పెట్టుబడులపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు
– బాబు విదేశీ పర్యటనలతో ఒరిగింది ఏమీ లేదు
– ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చూపగలరా?

హైదరాబాద్‌: టీడీపీ ప్రభుత్వం అంకెల గారడీ చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందని, అంకెల్లో బొంకే లెక్కలు చెప్పడం చంద్రబాబుకే సాధ్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. పెట్టుబడులపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందని, గతంలో  రూ. 1300 పైగా ఎంవోయులు చేసుకున్నామని చెప్పుకుంటున్నారని, ఇందులో 10 శాతం కూడా వాస్తవం లేదని ఆమె తప్పుపట్టారు.  హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం  వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అపోలో టైర్ల పరిశ్రమ వస్తుందని చెప్పారు. రూ.1800 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని చెప్పారు. ఈ ప్రకటనకు టీడీపీ ఫెస్‌బుక్‌కు మధ్య ఉన్న తేడాను గమనిస్తే అపోలో పరిశ్రమ రూ.525 కోట్లు మాత్రమే పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పింది. మీ పార్టీ ఒక్క లెక్క, మీ ప్రభుత్వం మరో లెక్కా, పెట్టుబడి పెట్టే పరిశ్రమ మరో లెక్క ఎందుకు చెప్పుతున్నారు. 2016–2017లో విశాఖలో జరిగిన సదస్సులో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు, రెండో సదస్సులో రూ. 6 లక్షల కోట్లు అంటూ మొత్తంగా రూ.10 లక్షల కోట్లు అన్ని చెప్పారు. అంకెల్లో కూడా బొంకె లెక్కలు టీడీపీకే సాధ్యం. పార్లమెంట్‌లో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన సమాచారం ప్రకారం ఒక్క ప్రాజెక్టు కూడా రిపోర్టుకు నోచుకోలేదని చెప్పారు. ఇది వాస్తవం. పార్టనర్‌ఫిప్‌ సమ్మీట్‌ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఎంత పెట్టుబడులు వచ్చాయి. వీటిపై ఆర్థిక మంత్రి సమాధానం చెప్పడం లేదు. టంగుటూరు మిరియాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. డీఐపీపీ రిపోర్టు తీసుకుంటే రూ. 10 వేల కోట్లకు మించి పెట్టుబడులు రాలేదన్నది వాస్తవం. ఈ పెట్టుబడులు ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండానే వస్తాయి. అన్ని దేశాలకు చంద్రబాబు వెళ్లాల్సిన అవసరం కూడా లేదన్నారు. తీసుకొస్తున్న పెట్టుబడులు మీరు పెట్టే ఖర్చులకు కూడా సరిపోవడం లేదన్నారు. పావలా చికెన్‌కు రూపాయి మసాల పెట్టినట్లుగా చంద్రబాబు పాలన ఉంది. చంద్రబాబు నిన్న చెబుతూ..నా పాలనలో ఎవరు రోడ్డున పడేలేదని చెబుతున్నారు. ఇప్పటి వరకు 7 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు చెబుతున్నారు. ఈ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఎవరికి ఇచ్చారో పేర్లు చెప్పగలరా అని నిలదీశారు. మాటకు కట్టుబడి ఉండటం ఈ ప్రభుత్వంలో చూస్తున్నామని చెప్పారు. మీరు ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు ఎందుకు ఆందోళన చేస్తారని ప్రశ్నించారు. మీరు చెప్పేదంతా బోగస్‌ మాటలే అన్నారు. కేంద్ర ప్రభుత్వం  5.8 జీడీపీ అని చెబుతోంది. 2016–2017లో ఏపీ జీడీపీ 12.8 ఉందని చంద్రబాబు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జీడీపీ ఇంత తక్కువ ఉంటే రాష్ట్ర జీడీపీ అంత ఎక్కువ ఎలా సాధించారు. వ్యవసాయం ఇంత సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో అంత జీడీపీ ఎలా సాధ్యమైందన్నారు. గ్రాఫిక్‌లో వృద్ధిరేటు చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి దాంట్లో కూడా టీడీపీ అంకెల గారడీ చేస్తుందన్నారు. తప్పుడు లెక్కలను చూపిస్తూ  2022, 2029, 2050 అంటూ చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపిస్తున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బాధ్యత కలిగిన మనుషులైతే ఈ లెక్కలపై సమాధానం చెప్పాలన్నారు.  పోలవరం నిర్మాణ విషయంలో సీబీఐ విచారణకు సిద్ధపడుతారా అని ఆమె సవాల్‌ విసిరారు. మూడింతలు అంచనాలు పెంచి రెండింతలు చంద్రబాబు తిని ఒక్క వంతుతో ప్రాజెక్టు కట్టి డ్రామాలు ఆడుతున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు.
 
Back to Top