అందుకే అవినాష్‌రెడ్డిని అడ్డుకున్నారు

విజయవాడ: ప్రాజెక్టులపై నిజాలు చెప్పే దమ్మూ, ధైర్యం టీడీపీకి లేదని, అందుకే జన్మభూమి సభలో వైయస్‌ అవినాష్‌రెడ్డిని అడ్డుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు.విజయవాడలో ఆయన మీడియతో మాట్లాడుతూ టీడీపీ తీరును తూర్పారబట్టారు. మంత్రి దేవినేని ఉమకు దమ్ముంటే ప్రాజెక్టులకు కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సుధాకర్‌బాబు డిమాండ్‌ చేశారు. దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఉమ అవినీతి బాగోతం ఎవరిని అడిగినా చెబుతారని తెలిపారు. నిజాలు చెప్పే ధైర్యం ఉమకు లేదని విమర్శించారు. అందుకే పులివెందుల సభలో వైయస్‌ అవినాష్‌రెడ్డిని అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.
 

తాజా ఫోటోలు

Back to Top