హోదా పోరు విజయవంతం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రత్యేకహోదా నినాదంతో రాష్ట్రం దద్దరిల్లింది. ప్రత్యేకహోదాపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది.  విశాఖలో అధినేత వైయస్ జగన్ ను క్యాండిల్ ర్యాలీకి అనుమతించకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ,  అదే సమయంలో ప్రత్యేకహోదాను సాధించే కొనసాగింపుగా పార్టీ నేతలు  ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలతో హోరెత్తించారు. పలు చోట్ల పోలీసులు వైయస్సార్సీపీ నాయకులను అన్యాయంగా అరెస్ట్ చేశారు. 
Back to Top