ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ లో ధర్నా

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని మరింత ఉధ్రతం చేయాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సీనియర్ నాయకుల సమావేశం జరిగింది. ప్రజల తరపున పార్టీ చేస్తున్న కార్యక్రమాలపై చర్చించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మోసపూరిత పరిపాలనపై ద్రష్టి పెట్టారు. ఏడాది కాలంగా ప్రత్యేక హోదా మీద పార్టీ ఉద్యమిస్తున్న తీరుని సమీక్షించారు. ఈ పోరుని మరింత ఉధ్రతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆగస్టు 10న ఢిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాయకత్వంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా ధర్నా నిర్వహిస్తారు. అనంతరం పార్లమెంటు దాకా మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఈ నిర్ణయాల్ని మీడియాకు వెల్లడించారు. 
Back to Top