హోదా పోరాటం ఉధృతం


- ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు
- ఎంపీల దీక్ష‌కు సంఘీభావంగా రాష్ట్ర‌వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన..
- నేటి నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు

అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన ఆందోళనను మరింత ఉధృతం చేసింది. పార్ల‌మెంట్ చివ‌రి బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసిన వెంట‌నే వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు  త‌మ ప‌ద‌వులకు రాజీనామా చేసి ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో ఈ నెల 6వ తేదీ నుంచి ఆమరణ దీక్షకు దిగారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు ఎంపీల‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా  శుక్రవారం సాయంత్రం  అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు.  ఇవాళ్టి నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్ట‌నున్నారు.  ఇందులో పార్టీ శ్రేణుల‌తో పాటు వివిధ ప్రజా సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు.  

తాజా ఫోటోలు

Back to Top