మా అంతు ఎలా తేలుస్తారో చెప్పండి..!

ఓటుకు కోట్లు అంశంపై చర్చకు ఎందుకు వెనకాడుతున్నారో చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేతలను డిమాండ్ చేశారు. దొంగతనం బయటపడింది. చంద్రబాబు అవినీతి ప్రపంచమంతా తెలిసిపోయింది. దానిపై చర్చకు రమ్మంటే మంత్రులకు ఉలుకెందుకో అర్థం కావడం లేదని శ్రీధర్ రెడ్డి అన్నారు.

ఏమన్నా అంటే మీఅంతు తేలుస్తామంటూ కళ్లు పెద్దవి చేసి..చేతులు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏంచేస్తారండి..? గోదావరిలో ముంచుతారా..గుంటూరు ఆస్పత్రిలో ఎలుకలతో కరిపిస్తారా..నారాయణ కాలేజీలో ర్యాగింగ్ చేయిస్తారా..? లేక వనజాక్షిని కొట్టినట్లు రౌడీలతో కొట్టిస్తారా...ఏలూరు తీసుకెళ్లి ఇంజక్షన్ వేయించి చంపిస్తారా..? ఎలా మా అంతు తేలుస్తారో చెప్పాలని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదని, అసెంబ్లీ అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. స్వర్గీయ డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో  ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని శ్రీధర్ రెడ్డి ప్రభుత్వనేతలకు సూచించారు.
Back to Top