వైయస్ఆర్ వర్థంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

ఆలమూరు : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా స్వర్ణయుగ పాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి వై.యస్‌.రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతి కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని వైయస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ తమ్మన శ్రీనివాసు తెలిపారు. స్థానిక విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆలమూరు బస్టాండు సెంటర్‌లో శనివారం నిర్వహించే సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. మహానేతకు నివాళులర్పించిన అనంతరం పలు సేవా, సామాజిక కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. గ్రామాల్లోని వైయస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్సార్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని సూచించారు. వైఎస్సార్‌ను అన్ని వర్గాల ప్రజలు స్మరించుకునే విధంగా వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరపాలన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

అనపర్తి : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా స్వర్ణయుగ పాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా శనివారం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ వైయస్సార్‌కు ఘన నివాళులర్పించాలని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్సార్‌ అభిమానులు వైయస్సార్‌ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని సూచించారు. వైయస్సార్‌ను అన్ని వర్గాల ప్రజలు స్మరించుకునే విధంగా వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరపాలన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

తాజా ఫోటోలు

Back to Top