విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు

మొగలికుదురు(మామిడికుదురు) :వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ పుట్టిన రోజు సందర్భంగా స్థానిక శ్రీసత్యసాయి భరోసా దీనజనోద్ధరణ కేంద్రంలో బుధవారం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. కొండేటి ఫాలోవర్స్‌ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ పి.గన్నవరం కో ఆర్డినేటర్‌కొండేటి చిట్టిబాబు వృద్ధులకు పండ్లు, పాల ప్యాకెట్లు, బ్రెడ్లు, చీరలు అందజేశారు. స్థానిక పార్టీ నాయకుడు నల్లమిల్లి గోవిందరెడ్డి చీరలను సమకూర్చారు. విజయమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని చిట్టిబాబు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యేడిద శ్రీనివాస్, మానెం కమలేశ్వరరావు, యల్లమెల్లి శ్రీనివాస్, మట్టా శ్యామ్, మేడిది కిరణ్, చిలకపాటి రాకేష్, కొండేటి స్టాలిన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. విదేశాల్లో ఉంటున్న జాలెం రాజు, మైలా లోవరాజు, మట్టా సునీల్, జాలెం కరణస్వరూప్, వడ్డి సురేష్, యల్లమెల్లి రాహుల్, యన్నాబత్తుల దుర్గాప్రసాద్, వడ్డి వీర్రాజు పండ్లు, బ్రెడ్లు, పాల ప్యాకెట్లు తదితర తినుబండారాలను సమకూర్చారు.

Back to Top