మజ్జిగ చలివేంద్రాల ఏర్పాటు

సాగర్‌నగర్‌: వేసవి తాపంలో సేద తీర్చే కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వార్డులో పలు ప్రాంతాల్లో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని బుధవారం వీటికి శ్రీకారం చుట్టారు. సుభాష్‌నగర్‌ ఏరియాలో వైస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు లొడగల రాంబాబు చలివేంద్రాన్ని ప్రారంభించారు. విశాలాక్షినగర్‌ శ్రీరామాలయం వద్ద నిర్వహించిన చలివేంద్రాన్ని ఆ పార్టీ నాయకుడు కనకరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మద్ది శేఖర్‌రెడ్డి, సాగర్‌నగర్‌ ఏరియా నాయకులు డాక్టర్‌ రాజా మోహన్, దువ్వి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top