సీఎం చంద్రబాబుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పట్టిసీమ ప్రాజెక్టు అంశంపై మంగళవారం నాడు అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష నేత సహా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరిపైనా బాబు బెదిరింపులకు దిగారని నోటీసులో పేర్కొన్నారు.  

అప్రజాస్వామిక భాషను వినియోగించాని కూడా తెలిపారు. తమను ఉద్దేశించి.. మీ అంతు చూస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారని అన్నారు.  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గిడ్డి ఈశ్వరి, అశోక్ రెడ్డి తదితర ఎమ్మెల్యేలు ఈ నోటీసును స్పీకర్ శివప్రసాదరావుకు అందజేశారు
Back to Top