రాజ‌న్న రాజ్యం రావ‌డం ఖాయం

ఒంగోలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్రకు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న వ‌స్తోంద‌ని ఇది చూస్తా ఉంటే రాజ‌న్న రాజ్యం రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు విజ‌య్‌చంద‌ర్ అన్నారు. పాద‌యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మా నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు చెబుతున్న క‌ష్టాలు చూస్తుంటే బాబు పాల‌న‌లో వాళ్లు ఎన్ని క‌ష్టాలు ప‌డుతున్నారో అర్థ‌మ‌వుతోంద‌న్నారు. బాబు పాల‌న‌లో ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌న్న‌ది వాస్త‌వం అన్నారు. చంద్ర‌బాబు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌న్నారు.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బాబుకు బుద్ధి చెప్ప‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం  చేశారు. త్వ‌ర‌లో మంచి రోజులు వ‌స్తాయ‌ని, రాజ‌న్న రాజ్యంలో అంద‌రూ సంతోషంగా ఉంటార‌ని విజ‌య్‌చంద‌ర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. 
Back to Top