బీజేపీ-టీడీపీలది కుమ్మక్కు రాజకీయం

న్యూఢిల్లీ:  బీజేపీ-టీడీపీలది కుమ్మక్కు రాజకీయాలని వైయ‌స్ఆర్‌ సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. లోక్‌సభలో 13 సార్లు వైయ‌స్ఆర్‌ సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినా చర్చకు రాలేదు. కానీ, టీడీపీ అవిశ్వాసంపై చర్చకు అనుమతిచ్చార‌ని తెలిపారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసినప్పుడు, కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనలకు వచ్చినప్పుడు వారి ముందు అతి వినయం ప్రదర్శిస్తున్నారని గుర్తు చేశారు.  నాలుగు నెలల కిందటి వరకు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులపై ప్రశంసల వర్షం కురిపించి, సన్మానాలు చేసిన టీడీపీ ఎంపీలు ఇప్పుడు నాట‌కాలు ఆడుతున్నార‌ని విమ‌ర్శించారు. వైయ‌స్ఆర్‌ సీపీ సభలో లేదుగనుకే బీజేపీ-టీడీపీలు డ్రామాలాడుతున్నాయి’ అని ఉమ్మారెడ్డి ఆక్షేపించారు.  

Back to Top