హోదా సాధ‌న‌కు వైయ‌స్ జగన్‌ తిరుగులేని పోరాటం

 విశాఖపట్నం : ప‌్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ జ‌గ‌న్ తిరుగులేని పోరాటం చేశార‌ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. విశాఖపట్నంలో  చేపట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’లో ఉమ్మారెడ్డి మాట్లాడారు. ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలను నెరవేరుస్తామని కేబినెట్‌ లో తీర్మానం చేశారని తెలిపారు. ఆ తరువాత  వచ్చిన టీడీపీ ప్రభుత్వం హోదా కంటే ప్యాకేజే కావాలని తీర్మానం చేసిందని, కేంద్రం ప్రత్యేక ప్యాకేజి మంజూరు చేయడంపై అసెంబ్లీలో ధన్యవాదాలు చెప్తూ తీర్మానాలు చేసి.. ఢిల్లీ వెళ్లి మరీ సీఎం చంద్రబాబు అభినందించి వచ్చారని తెలిపారు. 
ప్రత్యేక హోదా ఇచ్చిన ఈశాన్య రాష్ట్రాలు ఏమన్నా అబివృద్ధి చెందాయా అంటూ ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబు పేర్కొన్నారని తెలిపారు. వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీలోనూ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేశారని, దీంతో అసెంబ్లీలో సభ్యులందరూ తీర్మానంచేసి ఆమోదించినా.. దానిని చంద్రబాబు కేంద్రానికి పంపలేదని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు ప్యాకేజికి అంగీకరించి అసెంబ్లీని సైతం అవమానించారని మండిపడ్డారు.  చంద్ర‌బాబు తన రాజకీయ అవసరాల కోసం గంటకో మాటమార్చుతూ.. యూటర్న్‌ల మీద యూటర్న్‌లు తీసుకున్నారని దుయ్యబట్టారు.  


తాజా వీడియోలు

Back to Top