ప్రభుత్వం ఏం చేస్తోంది?


శ్రీకాకుళం: మహిళలపై దాడులు జరుగుతుంటే టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, టీడీపీ నేతల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం శుక్రవారం మీడియాతో మాట్లాడారు.  కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ నుంచి ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాల వరకు విచారణకు ఆదేశించాలని తమ్మినేని సీతారాం డిమాండు చేశారు. మహిళలపై వందల లైంగిక దాడులు జరుగుతున్నాయని సీఎం డ్యాష్‌బోర్డులో కనిపిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కంట్రోల్‌ చేయలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి తనకు రక్షణ ఇవ్వమని అనడం చేతకానితనమన్నారు. 
 
Back to Top