వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత మృతి

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు నిడమనూరి శ్రీనివాసరావు(55) గుండెపోటుతో గురవారం మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న వైయస్‌ఆర్‌సీపీ వినుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే డీసీసీ మక్కెన మల్లిఖార్జునరావు కారుమంచి గ్రామానికి చేరుకొని శ్రీనివాసరావుకు నివాళులర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని వారు కొనియాడారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో  వైయస్‌ఆర్‌సీపీ మండల అధ్యక్షులు చుండూరి వెంకటేశ్వర్లు, నాయకులు చుండూరి బోసు, బొల్లా రాములు, మెదరమెట్ల నరసింహారావు, వూట్ల నాగేశ్వరరావు, బొల్లా శివ, కూచి సుబ్బారావు, పెనుమాక పుల్లారావు, పాతకోట నాగుర్‌వలీ, మంగళగిరి ఎంపీపీ శ్రీనివాసరెడ్డి,పురేటి నాగేశ్వరావు, గడుపూడి బాగయ్య,బొల్లా పేరయ్య,రామాంజినేయులు ఉన్నారు.
Back to Top