ఎన్నికల కోసమే బాబు ప్రత్యేక హోదా పల్లవి


తూర్పుగోదావరి : ప్రత్యేక ప్యాకేజీని ఇన్నాళ్లు భుజాన వేసుకొని తిరిగిన చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయని ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నారని ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. చంద్రబాబు మోసాలను గమనించాలని, మోసపూరిత మాటలు నమ్మొద్దని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో ధర్మాన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాటం చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేంద్రంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగా కొనసాగుతూ..రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉంటూ ఎవరిపై చంద్రబాబు పోరాటం చేస్తారని ప్రశ్నించారు.మరోమారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top