ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే నాయకుడు వైయస్‌ జగన్‌

ఎండా, వాన లెక్క చేయకుండా పాదయాత్రగా ప్రజల చెంతకు
మూడు వేల కిలోమీటర్ల చేరువలో ప్రజాసంకల్పయాత్ర
కొత్తవలసలో పైలాన్‌ ఆవిష్కరణ ఏర్పాట్లు
విశాఖపట్నం: ఎండా, వాన లెక్క చేయకుండా ప్రజలే తన కుటుంబంగా వారి సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని పార్టీ నాయకుడు ఎం.వీ.వీ.సత్యనారాయణ అన్నారు. నవంబర్‌ 6వ తేదీ ఇడుపులపాయ దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద ఆశీస్సులు తీసుకొని పాదయాత్ర ప్రారంభించిన జననేత వైయస్‌ జగన్‌ మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకోనున్నారన్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి కోసం పోరాటాలు చేస్తూ.. వారి శ్రేయస్సు కోసమే వైయస్‌ జగన్‌ తపిస్తున్నారన్నారు. పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలురాయి దాటుతున్న సందర్భంగా కొత్తవలసలో పైలాన్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 
కార్మికులంతా జననేత వెంటే: గౌతమ్‌రెడ్డి
కార్మికులంతా వైయస్‌ జగన్‌కు అండగా ఉంటారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు ప్రజానీకం నీరాజనం పలుకుతున్నారని, రావాలి జగన్‌.. కావాలి జగన్‌ అనే నినాదంతో ఆయన వెంట నడుతుస్తున్నారన్నారు. కార్మికుల సంక్షేమం కోసం జననేత ప్రకటించిన పథకాలు వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయన్నారు. అన్ని రకాల కార్మికులను దృష్టిలో పెట్టుకొని వైయస్‌ జగన్‌ పథకాలు ప్రకటిస్తున్నారన్నారు. కార్మికుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపేందుకు పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చామని చెప్పారు. 

Back to Top