రేపటి బంద్‌కు అందరూ సహకరించాలి


– వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
–  టీడీపీకి ఓటేసిన పాపానికి ప్రజలు కష్టపడుతున్నారు
 – వైయస్‌ జగన్‌ వల్లే హోదా సజీవంగా ఉంది
 
విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 24న ఏపీ బంద్‌కు పిలుపునిచ్చారని, రేపటి బంద్‌ను విజయవంతం చేసేందుకు అఒందరూ సహకరించాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని, హోదా అంశం సజీవంగా ఉందంటే అది వైయస్‌ జగన్‌ వల్లే అన్నారు. టీడీపీకి ఓటేసిన పాపానికి ప్రజలు నాలుగేళ్లుగా కష్టపడుతున్నారని,  ప్రత్యేక హోదాను చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. మొన్న పార్లమెంట్‌లో జరిగిన అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన తీరుకు నిరసనగా, ఈ రాష్ట్రానికి ఇచ్చిన వాగ్ధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆ నాటి ప్రభుత్వం ఇచ్చిన మాటను, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ  ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. బీజేపీతో కలిసి ఎన్నికల ప్రచారంలో టీడీపీ కూడా పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని కోరిందన్నారు. అయితే నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చారన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు..ప్యాకేజీ కావాలని పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని చెప్పారన్నారు. ప్రత్యేక ప్యాకేజీని ఆర్థిక మంత్రి ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు స్వాగతించారని, మరునాడు అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. చంద్రబాబుకు ఓట్లు వేసిన పాపానికి ప్రజలు కష్టపడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిన నేపథ్యం, చంద్రబాబు అవినీతి, అక్రమ సంపాదనకు వ్యతిరేకంగా వైయస్‌ జగన్‌ ఈ నెల 24న బంద్‌కు పిలుపునిచ్చారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌లో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా కావాలనుకునే అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఆర్టీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

– వైయస్‌ జగన్‌ మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. మూడున్నరేళ్లుగా వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించామన్నారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే చంద్రబాబుకు ప్రధానమన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. రేపటి ఉదయం తెల్లవారుజాము నుంచే బంద్‌ మొదలవుతుందని, పార్టీ శ్రేణులందరూ కూడా ఇందులో పాల్గొంటారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొని మద్దతివ్వాలని ఆయన కోరారు. రేపటి బంద్‌లో విశాఖలో తాను, పార్టీ సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొంటామని బొత్స సత్యనారాయణ తెలిపారు. 
 
Back to Top