బీజేపీతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు


వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్‌: బీజేపీతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. 
నీతి ఆయోగ్‌ సమావేశం జరిగి ఇవాల్టికి తొమ్మిదిరోజులు అయ్యిందన్నారు. ఆ సమావేశానికి ముందుకు వరుసగా మూడు రోజుల పాటు లీకులు  ఇచ్చిన చంద్రబాబు..ఢిల్లీలో ప్రధానిని నిలదీస్తారని ఓ వర్గం మీడియాలో వార్తలు చూశామన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోడీకి చంద్రబాబు వంగి వంగి దండాలు పెట్టారని, సాయంత్రం మీడియా సమావేశం వాయిదా వేసి ఇంతవరకు అక్కడ ఏం మాట్లాడారో చెప్పడం లేదన్నారు. 
 
Back to Top