కేంద్రం మెడలు వంచి హోదా సాధించుకుంటాం

ప్రతిపక్షం నాలుగేళ్లుగా చెప్పినవే పవన్‌ చెప్పారు
ఇప్పటికైనా పవన్‌ కళ్లు తెరవడం మంచి పరిణామం
వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రేపే కేంద్రంపై అవిశ్వాసం
అన్ని పార్టీలను కలిసి మద్దతు కూడగడుతున్న వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు
టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వైయస్‌ఆర్‌ సీపీకి మద్దతు ఇవ్వాలి
హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాలుగేళ్లుగా చెబుతున్న విషయాలనే పవన్‌ కల్యాణ్‌ చెబుతున్నారని, ఇప్పటికైనా పవన్‌ చంద్రబాబు అవినీతిపై కళ్లు తెరవడం మంచి పరిణామమే అని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, ప్రజలు అన్ని రకాలుగా మోసపోయారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వారిలో సై్థర్యం నింపేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారన్నారు. 
అవిశ్వాస తీర్మానం...
పార్లమెంట్‌లో ఫైన్సాన్స్‌ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. రేపో.. ఎల్లుండో రాజ్యసభలో కూడా బిల్లు అప్రూవ్‌ చేస్తారు. ఆ తరువాత సభ నిరవధిక వాయిదా పడుతుందనే ముందస్తు ఆలోచనతో మా నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపే అవిశ్వాసం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఎంపీలు అవిశ్వాసం ప్రవేశపెడతారు. ఆ తరువాత స్పష్టమైన హామీ రాకపోతే రాజీనామాలు చేస్తాం. 
మద్దతు..
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని, వైయస్‌ఆర్‌ సీపీ ప్రవేశపెట్టబోయే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. ఆ లేఖ ద్వారా మా పార్టీ ఎంపీలు అన్ని పార్టీల లోక్‌సభ సభ్యుల వద్దకు వెళ్లి మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. బీజేపీ తప్ప అన్ని పార్టీలను మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. 
పవన్‌ కల్యాణ్‌ మాటలపై...
పవన్‌ కల్యాణ్‌ టీడీపీ అవినీతి గురించి నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌ సీపీ చెబుతున్నవే చెప్పారు. 2014లో పవన్‌ ఎందుకు చంద్రబాబుకు మద్దతు ఇచ్చారో చెప్పాలి. పవన్‌ మద్దతు ఇవ్వడం వల్ల టీడీపీ, బీజేపీలు గెలిచి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాయి. దీనికి పవన్‌ కల్యాణ్‌ నైతిక బాధ్యత వహించాలి. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతీ సభలోనూ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పెచ్చుమీరిందని, అభివృద్ధి కనిపించడం లేదు కానీ.. అవినీతి ఏరులైపోరుతున్నట్లుగా కనిపిస్తుందని, దేవాలయ భూములను, రైతులను భూములను కబ్జా చేశారని ఎన్నోసార్లు చెప్పారు. వాటిపై పవన్‌ ఎందుకు అప్పుడు మాట్లాడలేదు. ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై వాస్తవాలు గ్రహించినందుగా సంతోషంగా ఉంది. 
రాష్ట్ర ప్రజల అభివృద్ధే మా ఆకాంక్ష..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే మేలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ గ్రహించారు. అందుకే అవిశ్వాసం, రాజీనామాలు అనే స్టాండ్‌ తీసుకున్నాం. టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే మా వెనకాల రావాలి.. వచ్చి మద్దతు ఇవ్వాలి. కానీ టీడీపీ ఇంకా ఎన్టీయేలో భాగస్వామి. తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయరు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధించుకుంటాం. వైయస్‌ జగన్‌ పంథాలో మేము నడుస్తాం. 
 
Back to Top