కేసుల కోసం కేంద్రంతో బాబు లాలూచీ– వైయస్‌ జగన్‌పై ఎన్నో కుట్ర కేసులు బనాయించారు
– వైయస్‌ జగన్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అనేక కుట్రలు
– హెరిటేజ్‌ ఆదాయాలపై విచారణకు బాబు సిద్ధమా?
– బాబు, లోకేష్‌ ఎప్పటికైనా విచారణ ఎదుర్కోక తప్పదు
– చంద్రబాబు అవినీతి గురించి తోడల్లుడు దగ్గుపాటి పుస్తకం రాశారు
– తుని విధ్వంసానికి చంద్రబాబే సూత్రధారి
–  బీజేపీతో చంద్రబాబే అంటకాగుతున్నారు

హైదరాబాద్‌: వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, కేసుల కోసం కేంద్రంతో లాలూచీ పడ్డారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. వైయస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక ఆయన కుటుంబ సభ్యులను కుట్ర కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర చంద్రబాబు అవినీతిపై దండయాత్రలాగ సాగుతోందన్నారు. వైయస్‌ జగన్‌ను ఎదుర్కొలేక తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు జిల్లాకో మైనింగ్‌ డాన్‌ను తయారు చేశారని, మైనింగ్‌ దొంగలకు , ఎ్రరచందనం దొంగలకు ..కాల్‌మనీ డాన్లకు, మట్టి దొంగలకు, ఇసుక దొంగలకు..అందరికీ చంద్రబాబే డాన్‌ అని అభివర్ణించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంతో చంద్రబాబు పండిపోయారని ధ్వజమెత్తారు. 

 వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరపతిని దెబ్బతీసేందుకు, వ్యవస్థలను మేనేజ్‌ చేసే చంద్రబాబు మళ్లీ తన విషపు కోరల్ని బయటకు తీసి వైయస్‌ జగన్‌ సతీమణి భారతమ్మను కేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ఈడీలో తనకు కావాల్సిన వ్యక్తులు, టీడీపీకి తొత్తులుగా పనిచేస్తున్న ఉమాశంకర్‌గౌడు, గాంధీ అనే అధికారులు గత నాలుగేళ్ల క్రితం ట్రాన్స్‌ఫార్‌ అయినా కూడా అదే సంస్థలో కొనసాగుతున్నారన్నారు. ఈ అధికారులు చంద్రబాబు కనుసన్నల్లో వైయస్‌ జగన్‌పై కుట్రలు చేస్తున్నారన్నారు. ఈడీ పత్రాలను చంద్రబాబు వారి ద్వారా ముందే తీసుకొని, తనకు కావాల్సిన మీడియా ప్రతినిధులకు అందించి వైయస్‌ భారతిపై కేసులు  బనాయిస్తున్నారని, చార్జ్‌షిట్లో ఆమె పేరు ఉందని దుష్ప్రచారం చేయడం ద్వారా మళ్లీ ఏడేళ్ల క్రితం వైయస్‌ జగన్‌పై పెట్టిన కుట్ర కేసుల ద్వారా ఆయన ప్రాభల్యం తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మళ్లీ వైయస్‌ జగన్‌ ప్రాభాల్యాన్ని పలుచన చేయడానికి, రాజకీయంగా ఎదుర్కొలేక, ఎదురించే సత్తా లేకపోవడంతో ఈ  రకంగా వ్యవస్థలను మేనేజ్‌ చేసే చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా తనకు సంబంధించిన అధికారులతో ఈ విధంగా వైయస్‌ భారతి పేరు ఇరికిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఈ రకమైన ఎత్తుగడలను భుజాన వేసుకోగానే, తనను మోసే పత్రికలు భారతి పేరు ఈడీ చార్జ్‌షిట్లో ఇరికించినట్లుగా, ఆమె అత్యంత లబ్ధి పొందినట్లుగా ఈ పచ్చ పత్రికలు చంద్రబాబు సంస్థ అయిన హెరిటేజ్‌కు డైరెక్టర్‌గా ఉన్న భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి రూ.9.50 కోట్ల వార్శిక వేతనం వస్తున్నది ప్రచురించడానికి పచ్చ మీడియాకు చేతులు ఆడలేదని, కలం పని చేయడం లేదని విమర్శించారు. 
– చంద్రబాబు హెరిటేజ్‌ సంస్థ ద్వారా పొందుతున్న ఆదాయం గత  మూడేళ్లలో ఏపీ సంవత్సర తలసరి ఆదాయం  ఏమాత్రం పెరగడం లేదన్నారు. హెరిటేజ్‌ ఆర్థిక ఆదాయం మాత్రం వేలాది కోట్లుగా ఎలా పెరుగుతుందన్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వడం లేదన్నారు. హెరిటేజ్‌ ఆదాయంపై చంద్రబాబు విచారణకు సిద్ధమా అని సవాలు విసిరారు. 
– చంద్రబాబు రేపు అధికారం నుంచి దిగిపోయిన తరువాత నీపైన, నీ కుమారుడు, మంత్రి లోకేష్‌ చేస్తున్న అవినీతిపై, హెరిటేజ్‌ అక్రమార్జనపై భవిష్యత్తు ప్రభుత్వాలు విచారణ చేయడం ఖాయమని భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఆ రోజు చంద్రబాబు, లోకేష్, డైరెక్టర్లుగా ఉన్న వారి కుటుంబ సభ్యులు విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందన్నారు. 
– చంద్రబాబు చాలా నిజాయితీపరుడుగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మచ్చ లేని మహా పురుషుడిగా ప్రకటించుకుంటున్నారన్నారు. మీ గురించి సాక్షాత్తు మీ తోడళ్లుడు, మిమ్మళ్లి ముఖ్యమంత్రి చేసేందుకు అప్పట్లో అతి కీలక పాత్ర పోషించిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు ‘‘ఒక చరిత్ర– కొన్ని నిజాలు’’ అన్న పుస్తకంలో మెడికల్‌ సీట్ల పెంపు ఉద్యమంలో చంద్రబాబే బస్సులు తగులబెట్టండి అని పిలుపునిచ్చినట్లు, లోకేంద్రనాథ్‌ అనే కార్యకర్తకు కనీసం రెండు, మూడు బస్సులు తగులబెట్టమని చంద్రబాబు ఆదేశించినట్లు రాశారని గుర్తు చేశారు. కాపు నాయకుడు వంగవీటి రంగను హత్య చేయడంలో ప్రధాన కీలకదారి చంద్రబాబే అని ఆ నాటి హోంశాఖ మంత్రి హరిరామజోగయ్య తన ఆత్మకథ పుస్తకంలో రాశారని తెలిపారు. తుని సంఘటనలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు చేయించారని, తనపై సీఐడీ ద్వారా పిలిపించి, మూడుసార్లు విచారణ చేయించి ఒక్క ఆధారం కూడా లేకపోగా, ఆ అధికారులే తన పాత్ర ఏమీ లేదని తేల్చారన్నారు. ఇది టీడీపీ నేతలు చేయించిన కార్యక్రమంలా కనబడుతుందని, ఏమీ చేయలేని పరిస్థితి అని సీఐడీ అధికారులు నిస్సహాయతను వ్యక్తం చేశారని తెలిపారు. తుని ఘటన జరిగి రెండున్నరేళ్లు అవుతున్నా..ఇప్పటి వరకు ఎందుకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. చిన్న తప్పు జరిగితేనే వెనువెంటనే తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించే చంద్రబాబు, ప్రత్యేక హోదా కోసం రోడ్డుపై ధర్నా చేస్తేనే జైలుకు పంపించారన్నారు. తునిలో టీడీపీ కార్యకర్తలు రైలు తగులబెట్టారు కాబట్టి, చంద్రబాబు ఆదేశానుసారంగా తునిలో రైలు తగులబడిందని కాబట్టి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తమ్ముడి అనుచరులే రైలును తగులబెట్టారు కాబట్టి ఇప్పటి వరకు కేసులు నమోదు అయ్యాయే తప్పా..ఒక్క ముద్దాయిని కూడా మీరు కనిపెట్టలేకపోయారని దుయ్యబట్టారు. నిందలు వైయస్‌ఆర్‌సీపీపై నిరంతరం మోపుతూ..అదుపులోకి తీసుకోవాల్సిన టీడీపీ నేతలను ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్టు చేయలేదన్నారు. తుని ఘటనలో చంద్రబాబు మనుషులే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టారని వైయస్‌ జగన్‌ పేర్కొన్నది అక్షర సత్యమన్నారు. కాదు అయితే ఇంతవరకు నిజమైన నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌కు ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీతో మేం లాలూచీ పడ్డట్టుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా కేసుల కోసమే బీజేపీలో లాలూచీ పడి ఉంటే వైయస్‌ జగన్‌ సతీమణి భారతి పేరు చార్జ్‌షిట్‌లో ఈడీ ఎందుకు చేర్చుతుందని నిలదీశారు. మేం మీలాగా మేనేజ్‌మెంట్‌ స్కీల్స్‌ ఉన్నవాళ్లమే అయితే ప్రతి శుక్రవారం మా నాయకుడు కోర్టుకు Ðð ళ్లవలసిన అవసరమే ఉండేది కాదు కదా చంద్రబాబు అని ప్రశ్నించారు. నిరంతరం బీజేపీతో చంద్రబాబు అంటకాగుతున్నారు కాబట్టే ఉమాశంకర్‌గౌడు, గాంధీ ఆ సంస్థలో కొనసాగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాకు అత్యంత సన్నిహిత మిత్రుడే అని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించారని గుర్తు చేశారు. చంద్రబాబు వైయస్‌ఆర్‌సీపీ ట్రాప్‌లో పడుతున్నారని పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీ అనగలుగుతున్నారని చెప్పారు. మహారాష్ట్ర బీజేపీ ఆర్థికశాఖ మంత్రి భార్య ఇప్పటి వరకు కూడా టీటీడీ బోర్డు మెంబర్‌గా కొనసాగుతున్నారని తెలిపారు. ఇన్ని ప్రత్యక్ష ఉదాహరణలు కొనసాగుతుంటే ..మేం బీజేపీతో అంటకాగుతున్నట్లు మాపై కేసులు బనాయిస్తూ వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్న చంద్రబాబు ఈ నాలుగేళ్లలో ఎన్ని అక్రమాలకు పాల్పడినా ఎలాంటి చర్యలు లేవన్నారు. ఓటుకు కోట్లు కేసులో అన్ని ఆధారాలు ఉన్నా కూడా చంద్రబాబు అరెస్టు కాకుండా కాపాడుకుంటున్నారని విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ..ఇతరులపై తన ప్రతికారేచ్ఛలను తీర్చుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. అధికార వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని వైయస్‌ జగన్‌ను దెబ్బతీసేందుకు ఏ అవకాశాన్ని కూడా జారవిడుచుకోకుండా ప్రయత్నాలు చేయడం, గతి లేని పరిస్థితిలో ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చినా కూడా ఇప్పటికీ కూడా బీజేపీతో తన సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. 


 
Back to Top