హ‌త్యా రాజ‌కీయాల‌కు టీడీపీ తెర‌



అనంత‌పురం : ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు హత్యా రాజకీయాలకు తెర లేపుతున్నారు. తమకు అడ్డుగా ఉన్నవారిని అంతమొందించేందుకు కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగానే తాడిపత్రిలో వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్‌రెడ్డిపై బుధవారం అర్ధరాత్రి ఓ అగంతకుడు హత్యాయత్నం చేశాడు. రమేష్‌రెడ్డి తన ప్రాణాలను కాపాడుకునేందుకు తన లైసెన్స్‌ పిస్టల్‌తో ఆ అగంతకునిపై కాల్పులు జరిపారు. అయితే పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆగంతకుడికి మతిస్థిమితం లేదంటూ, రమేష్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నేత‌లు పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

తాజా ఫోటోలు

Back to Top