<br/><strong>- దళిత, గిరిజన, బహుజనుల వెతలు పట్టవా</strong><strong>- సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధం కావాలి</strong>విజయవాడ: జడ్జిలుగా దళితులు, గిరిజనులు, బహుజనులు పనికిరారా అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున ప్రశ్నించారు. జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆరుగురు జడ్జిలలో ఐదుగురు జడ్జిలకు అర్హత లేదని నివేదిక ఇవ్వడందుర్మార్గమన్నారు. చంద్రబాబు దళిత, గిరిజన, బహుజన వ్యతిరేకి అన్నారు. బడుగులు, దళితుల పట్ల చంద్రబాబు ఇంత అన్యాయం చేస్తుంటే ఆయనపై ఎందుకు సీబీఐ విచారణ చేపట్టరని డిమాండు చేశారు. జడ్జిలుగా సరిపోరు అనడగానికి చంద్రబాబు వద్ద ఏ ఆధారాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క దళిత, గిరిజనుడు లేడని విమర్శించారు. దళితులను దూరం పెట్టాలన్నదే చంద్రబాబు ఆలోచన అన్నారు. రాజ్యాంగ బద్ధంగా చేయాల్సిన అంశాలకు చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎంత కేటాయించారు. ఎంత ఖర్చు పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎంత స్కాలర్‌షిపులు పెంచారని నిలదీశారు. 768 హాస్టళ్లను మూసి వేయడంతో 70 వేల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారన్నారు. దళిత, గిరిజన, బహుజనునల వెతలు పట్టవా అని ఫైర్ అయ్యారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు అనే వ్యక్తి ఈశ్వరయ్య చెప్పినట్లుగా దళితులు, గిరిజనులు, బహుజనులను వెంటాడుతున్నారన్నారు. చంద్రబాబు నుంచి రక్షించబడాలంటే వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి రావాలన్నారు. దళిత, గిరిజన మంత్రులు కళ్లు లేని కబోదుల్లా పని చేస్తున్నారన్నారు. సహజ వనరులు, దేవుడి గుళ్లు మింగుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారు. చంద్రబాబు అనే వ్యక్తి రాబోయే ఎన్నికల్లో మోసం చేసేందుకు తన బినామీలను పంపుతున్నారన్నారు. చంద్రబాబు బహిరంగంగా దళితులకు క్షమాపణ చెప్పాలన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణకు ముందుకు రావాలన్నారు. న్యాయబద్దంగా పరిపాలన జరిగినప్పుడే అన్ని వర్గాలకే మేలు జరుగుతుందన్నారు. <br/>