చంద్రన్న ముందడుగు కాదు..దళితుల వెనుకడుగు

– దళితులను మోసం చేసేందుకు సమాయత్తం
– టీడీపీ పాలనలో దళితులు 20 ఏళ్లు వెనక్కి పోయారు
– దళితులకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి
– దళితుల అభ్యున్నతికి వైయస్‌ఆర్‌ కృషి
విజయవాడ: ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబుకు దళితులు  గుర్తుకు వస్తున్నారని, మళ్లీ దళితులను మోసం చేసేందుకు చంద్రబాబు సమాయత్తం అవుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు మేరుగ నాగార్జున విమర్శించారు. దళితుల్లో ఎవరు పుడతారు అన్న చంద్రబాబు ఇంతవరకు తన మాటలు వెనక్కి తీసుకోలేదన్నారు. మీ పాలనలో దళితులకు ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో దళితులు 20 ఏళ్లు వెనక్కి వెళ్లారని విమర్శించారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న చంద్రన్న ముందడుగు కార్యక్రమం బదులు చంద్రన్న వెనుకడుగు అని పెట్టి ఉంటే బాగుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది స్వర్ణయుగం అని మోసపోయామని, టీడీపీ పాలనలో దాడులు విఫరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులకు ఏం మేలు చేశారో సమాధానం చెప్పాలన్నారు. సెంటు భూమి ఇచ్చిన దాఖలాలు లేవని, పేదలకు ఇచ్చిన భూములు, ఇంటి స్థలాలు బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు. దళితుల వెలివేత, దళిత చట్టాలను అపహాస్యం చేయడం, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మీ చుట్టలా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఆలోచన సరళికి అనుగుణంగా మీ మంత్రులు మరో అడుగు ముందుకు వేసి అదే కోవలో వెళ్తున్నారని, ఇదే దళితులకు ఇచ్చిన గౌరవం అన్నారు. అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్‌ పుట్టిన నేలలో నేను పుట్టినందుకు సంతోషంగా ఉన్నానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇప్పుడు దళితులు గుర్తుకు వచ్చారా అని నిలదీశారు. మీరు పుట్టిన తేదీ ఏంటి? మీరు జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్‌లతో పోలిక మీకుందా?. మీరు పుట్టింది హిట్లర్‌పుట్టిన రోజు అని ఎద్దేవా చేశారు. మీ పాలనలోS దళితుల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. దళితుల్లో ఎవరు పుడతారు అన్న మీ మాటలను ఈ రోజు వరకు వెనక్కి తీసుకోలేదన్నారు. క్షమాపన చెప్పలేదన్నారు. మీ పాలనలో దళితులను గరగప్రరులో వెలివేశారని, ప్రకాశం జి ల్లా దేవరాపల్లిలో భూములు లాక్కున్నారని, పెందుర్తిలో మహిళలను వివస్త్రను చేశారన్నారు. అనంతపురంలో మహిళలపై దాడులు చేస్తే ఇంతవరకు మాట్లాడలేదన్నారు. వీటికి సమాధానం చెప్పి దళితవాడలకు వెళ్లాలని సూచించారు. 

వైయస్‌ఆర్‌ హయాంలో 30 లక్షల ఎకరాలు పంపిణీ
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో దళితులకు 30 లక్షల ఎకరాలు భూములు పంపిణీ చేశారని, పేదలకు ఇల్లు కట్టించారని నాగార్జున కొనియాడారు. 40 శాతం స్కాలర్‌షిప్‌లు పెంచి ఆదుకున్నారన్నారు. ఆనాడు దళితులు భరోసాగా ఉండేవారన్నారు. ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ఎప్పుడు వచ్చిందో తెలియదని విమర్శించారు. కూడు, గూడు, ఆరోగ్యం అన్నీ కూడా వైయస్‌ఆర్‌ హయాంలో వచ్చిందని చెప్పారు. చంద్రబాబుది నీతిబాహ్యమైన చర్య అని అభివర్ణించారు. దళితులకు ఒక్క ఎకరా భూమి ఇచ్చారా అని నిలదీశారు. నాడు వైయస్‌ఆర్‌ హయాంలో దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.5 వేల కోట్లు ఇచ్చారన్నారు. చంద్రబాబు మాత్రం తన బొమ్మ వేసుకొని ఇన్నోవా కార్లు టీడీపీ నేతలకు పంచిపెట్టారన్నారు. మీకు రాజ్యాంగం అంటే ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున స్వయాన ఓ ముఖ్యమంత్రి రిపబ్లిక్‌వేడుకలకు దూరంగా ఉండటం దేశంలోనే ఇది ప్రథమం అన్నారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు మీరు స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనకపోవడంతోనే మీ గౌరవం ఎంతో అర్థమవుతుందన్నారు. కౌంద్రం ప్రకటించిన పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. దళితులకు మరుగుదొడ్లు, బాతురూములు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.  దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఫైర్‌ అయ్యారు. దళితుల సంక్షేమం కుంటుపడిందని, చివరికి రిపబ్లిక్‌ డే రోజు ఇంట్లో మీ భార్య జెండా ఎగురవేస్తారా? మీరు రాష్ట్రంలో లేకపోతే మీ బావమరిది సీఎం కుర్చీలో కూర్చిన సమీక్షలు చేయడమా అని నిలదీశారు. ఇదేనా మీకు రాజ్యంగంపై ఉండే గౌరవం అన్నారు. దళితులకు క్షమాపణ చెప్పిన తరువాతే దళిత వాడలకు వెళ్లాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన మళ్లీ వస్తేనే దళితులకు మేలు జరుగుతుందని, వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. 
 
Back to Top