దళితులకు అండగా వైయస్‌ఆర్‌ సీపీ

పశ్చిమ గోదావరి జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే బినామీ బలరామరాజును రక్షించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు దళితులను అష్టకష్టాలు పెడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. దీన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా గరగప్రరులో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు తమను సాంఘీక బహిష్కరణ చేశారంటూ దళితులు కొద్ది రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు వైయస్‌ఆర్‌ సీపీ నేత మేరుగు నాగార్జున వారిని పరామర్శించేందుకు వెళ్లారు. దీంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పార్టీ నేతలను, ప్రజా సంఘాల నాయకులను అడ్డుకున్నారు. గరగప్రరులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మీడియాతో మేరుగు నాగార్జున మాట్లాడుతూ... దళితులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. దళిత చట్టాలను తూచా తప్పకుండా పాటించాలని, చట్టాలకు తూట్లు పొడుస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దళితులపై అమానుషంగా ప్రవర్తించిన రాజును తక్షణమే అరెస్టు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. 

తాజా వీడియోలు

Back to Top