ఈనెల 25న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ముఖ్యనాయకుల సమావేశం

హైదరాబాద్ః పార్టీ అధ్య‌క్షులు  వైయ‌స్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈనెల 25న పార్టీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ముఖ్యనాయకుల సమావేశం జరగనుంది.  ఈమేరకు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో  బుధవారం  ఉ. 10:00 గం.ల నుండి 11:30 గం.ల వ‌ర‌కు పార్టీ ''రాష్ట్ర య‌స్‌.సి., య‌స్‌.టి. ముఖ్య నాయ‌కుల స‌మావేశం'' జరుగుతుంది. 

ఎస్సీ, ఎస్టీల  సంక్షేమం, అభివృద్ధి అంశాల‌మీద పార్టీ మేనిఫెస్టోను నిర్ణ‌యించే బాధ్య‌త నాయ‌కుల‌కు అప్పగించనున్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్‌లో ఏమి ఉండాలి అనే అంశం మీద సలహాలు,  సూచ‌న‌లు ప్ర‌జ‌ల నుంచి, ఆయా వ‌ర్గాల నుంచి తీసుకునే బాధ్య‌త కూడా నాయకులకు అప్పగిస్తారు. 
Back to Top