వైయస్సార్సీపీ "సేవ్ విశాఖ" మహాధర్నా

విశాఖపట్నంః జిల్లాలో టీడీపీ నేతల భూ కబ్జాలపై రాష్ట్ర ప్రజానీకం కన్నెర్రజేసింది. సేవ్ విశాఖ పేరుతో జీవీఎంసీ ఎదుట వైయస్సార్సీపీ చేపట్టిన మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు, అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ధర్నాలో వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ స్వయంగా పాల్గొంటున్నారు.  పేదలు, ప్రభుత్వ భూములను లూటీ చేసిన ప్రభుత్వ పెద్దల భూ దందాలను మహాధర్నా వేదికగా  వైయస్ జగన్ ఎండగడతారు. కాసేపటి క్రితమే ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైయస్ జగన్ అక్కడి నుంచి నేరుగా ధర్నాస్థలికి చేరుకుంటారు.

Back to Top