అసత్యాలపై సూటిగా స్పందన

హైదరాబాద్)) అసత్యాలతో కూడిన ప్రకటనలు చేస్తూ, ప్రజల్ని తప్పు దోవ పట్టిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ మహేశ్వర రావు ల వైఖరిని వైయస్సార్సీపీ తప్పు పట్టింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేరు మీద ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల అయింది. చాలా స్పష్టంగా లోకేష్, ఉమ ల మీద ప్రశ్నలు సంధించింది.

విలువలు, సంస్కారం గురించి నారా లోకేష్ లెక్చర్లు దంచటం మానుకొంటే మంచిదని హితవు పలికింది. ఈ ప్రెస్ నోట్ తో పాటు కొన్ని ఫోటోలు విడుదల చేసింది. ఈ ఫోటోలకు జవాబు చెబితే చాలని, విలువలు సంస్క్రతి ని ప్రజలు అర్థం చేసుకొంటారని పేర్కొంది. 
దేవినేని ఉమ బాధ్యత లేకుండా ప్రకటనలు చేస్తున్నారని వైయస్సార్సీపీ అభిప్రాయ పడింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు నల్లధనాన్ని వెల్లడి చేసిన వారికే వాటి వివరాలు తెలుస్తాయని, వాటి మీద మాట్లాడుతున్నారు అంటే చంద్రబాబు అండ్ కో దే ఈ నల్లధనం అని పార్టీ పేర్కొంది. రెండేళ్లలోనే లక్షన్నర కోట్లు తినేసిన టీడీపీ నేతలు వీటిలో కొంత మొత్తాన్ని తెల్లధనంగా కూడా మార్చుకోగల సమర్థులే అని వైయస్సార్సీపీ చెప్పింది. అవినీతి సొమ్ములే పెట్టుబడిగా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి అన్ని కోట్ల డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని సూటిగా ప్రశ్నించింది. తెలంగాణ లో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ దొరికిపోయినా దాని మీద మాట్లాడక పోవటానికి కారణం ఏమిటని నిలదీసింది. అంటే దొంగే దొంగతనం చేసి, తర్వాత దొంగ దొంగ అని అరిచినట్లుగా ఇతరులకు బురద పూసేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ వైఖరిని అభివర్ణించింది.
తెలుగుదేశం అవినీతి మీద ధైర్యం ఉంటే విచారణకు సిద్ధం కావాలని వైయస్సార్సీపీ సవాల్ విసిరింది. ధైర్యం ఉంటే తమ నాయకుడి మీద చేసిన ఆరోపణలకు రుజువులు చూపించాలని నిలదీసింది.
Back to Top