ఘనంగా జ్యోతిరావు పూలే వర్థంతి

ఒంగోలుః వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో పూలే వర్థంతి వేడుకల్లో పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 125వ వర్థంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహానీయుడు పూలేని వైవి సుబ్బారెడ్డి కొనియాడారు. 

పూలే ఆశయాలను, ఆయన్ని గురువుగా భావించి అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారని సుబ్బారెడ్డి చెప్పారు. దీనిలో భాగంగానే 26,27 రెెండ్రోజుల పాటు వైఎస్సార్సీపీ రాజ్యాంగ ఆమోద దినోత్సవ ఉత్సవాలు జరుపుకున్నామన్నారు.  సమాజంలో అసమానతలు తొలగించేందుకు పూలే ఎంతగానో పోరాడారని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top