జలదీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా రిలేదీక్షలు

కర్నూలుః తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా, మొద్దునిద్ర పోతున్న ఏపీ సర్కార్ ను తట్టిలేపేందుకు అధ్యక్షులు వైయస్ జగన్ చేపట్టిన జలదీక్ష కొనసాగుతుంది. జననేత దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్సీపీ శ్రేణులు రిలే దీక్షలు చేపట్టారు. ఏపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరి, మోసపూరిత విధానాలపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీని బలపశువును చేస్తున్న వైనంగా మండిపడ్డారు. 

ప‌శ్చిమ‌గోదావ‌రి: 
న‌ర్సాపురంలో  వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన జ‌ల‌దీక్ష‌కు మ‌ద్ద‌తుగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్య‌క్షుడు ఆళ్ల‌నాని ఈఆందోళనలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో జననేత జ‌ల‌దీక్ష‌కు మ‌ద్ద‌తుగా కార్య‌క‌ర్తలు రిలే దీక్షలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బాల‌రాజు ఆధ్వ‌ర్యంలో పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ మండ‌ల కేంద్రాల్లో పార్టీ నాయకులు రిలేదీక్షలు ప్రారంభించారు. ఉండి నియోజ‌క‌వ‌ర్గ మండ‌ల క‌న్వీన‌ర్ రామానాయుడు ఆధ్వ‌ర్యంలో స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలేదీక్షలు చేపట్టారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లపై చంద్రబాబు నోరుమెదపకపోవడం పట్ల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కృష్ణా: 
వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన జ‌ల‌దీక్ష‌కు మ‌ద్ద‌తుగా గుడివాడ ఆర్డీఓ కార్యాల‌యం ఎదుట వైయ‌స్సార్ సీపీ నాయ‌కులు శ‌శిభూషన్ ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే కొడాలినాని సంఘీభావం తెలిపారు. గ‌న్న‌వ‌రం, బాపుల‌పాడు, విజ‌య‌వాడ రూర‌ల్ మండ‌ల కేంద్రాల్లో వైయ‌స్సార్‌సీపీ నాయ‌కుడు రామ‌చంద్రారెడ్డి ఆధ్వ‌ర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. విజయవాడ అలంకార్ సెంట‌ర్‌లో వైయస్సార్సీపీ యూత్ వింగ్ రాష్ట్ర వంగవీటి రాధా ఆధ్వ‌ర్యంలో  రిలే దీక్షలు చేపట్టారు. కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో నాగేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో, పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉప్పాల రాంప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలోవైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు రిలేదీక్షలు చేపట్టారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న ఆధ్వ‌ర్య‌లో పాముర్రు, మొవ్వ‌, మామిడిముక్కులుల‌లో నిర‌స‌న దీక్ష‌లు.  మాజీ ఎమ్మెల్యే జోగిర‌మేష్ ఆధ్వ‌ర్యంలో మైల‌వ‌రం, కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్ర‌హీంప‌ట్నం, ఆవ‌నిగ‌డ్డ‌ల‌లో కొన‌సాగుతున్న రిలే దీక్ష‌లు. 

గుంటూరు: 
గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన జ‌ల‌దీక్ష‌కు మ‌ద్ద‌తుగా జిల్లా అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న రిలే దీక్ష‌లు. అచ్చంపేట, అమ‌రావ‌తి మండ‌ల కేంద్రాల్లో వైయ‌స్సార్ సీపీ కార్య‌క‌ర్త‌లు రిలే దీక్షలు చేపట్టారు. తెనాలి వైయ‌స్సార్‌సీపీ స‌మ‌న్వ‌య‌కర్త శివ, గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో కృష్ణమూర్తి ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న రిలే దీక్ష‌లు. న‌ర‌సారావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న రిలే దీక్ష‌లు. మాచ‌ర్ల‌లో యువ‌జ‌న విభాగం నాయ‌కుడు వెంక‌ట‌రామిరెడ్డి ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ ఎదుట కొన‌సాగుతున్న రిలే దీక్ష‌లు. రేప‌ల్లెలో వెంక‌ట‌ర‌మ‌ణ ఆధ్వ‌ర్యంలో రిలేదీక్షలు జరుగుతున్నాయి. 

ప్ర‌కాశం:
ప్ర‌కాశం జిల్లా కొత్త‌ప‌ట్నంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల దీక్ష‌లు. ఎర్ర‌గొండ‌పాలెంలో మండ‌ల క‌న్వీన‌ర్ కిర‌ణ్‌గౌడ్ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న దీక్ష‌లు. సంఘీభావం తెలిపిన ప్ర‌జాప్ర‌తినిధులు. మార్కాపురం ఆర్డీఓ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా చేసిన హ‌నుమారెడ్డి, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు. పెద్దార‌వీడు ఎమ్మార్వో కార్యాల‌యం ఎదుట వైయస్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా ధ‌ర్నా చేప‌ట్టిన వైయ‌స్సార్ సీపీ నాయ‌కులు  చీరాల‌లో వైయ‌స్సార్‌సీపీ నేత‌లు బాలాజీ, అమృత‌ప్రాణి ఆధ్వ‌ర్యంలో రిలే దీక్ష‌లు చేప‌ట్టిన వైయ‌స్సార్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు. త‌హ‌శీల్దార్ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా చేప‌ట్టిన మాజీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి త‌దిత‌రులు. 

నెల్లూరు: 
తెలంగాణ అక్ర‌మ ప్రాజెక్టుల‌కు వ్య‌తిరేకంగా  వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేపట్టిన జ‌ల‌దీక్ష‌కు మ‌ద్ద‌తుగా ...వెంక‌టాచ‌లంలో రిలేదీక్షలు చేపట్టారు.  జిల్లా అధ్య‌క్షుడు గోవ‌ర్థ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ప‌లుచోట్ల దీక్షలు కొనసాగుతున్నాయి. గూడూరులోని స‌బ్‌క‌లెక్ట‌రేట్ ఎదుట దీక్ష‌లు చేప‌ట్టిన వైయ‌స్సార్ సీపీ నాయ‌కులు. కావ‌లిలో ఎమ్మెల్యే ప్ర‌తాప్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న దీక్షలు.

చిత్తూరు: 
వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన జ‌ల‌దీక్ష‌కు మ‌ద్ద‌తుగా పుంగ‌నూరు, మ‌ద‌న‌ప‌ల్లెలో కొన‌సాగుతున్న రిలే నిరాహార దీక్ష‌లు. రేణిగుంట మండ‌ల ప‌రిష‌త్ ఎదుట దీక్ష‌లు చేప‌ట్టిన వైయ‌స్సార్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు. వైయ‌స్సార్ సీపీ నాయ‌కుడు చంద్ర ఆధ్వ‌ర్యంలో చంద్ర‌గిరి ఎమ్మార్వో కార్యాల‌యం ఎదుట నిర్వహించిన ధ‌ర్నాలో వైయ‌స్సార్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు పాల్గొన్నారు. గంగాధ‌ర‌ నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్సార్ కార్య‌క‌ర్తలు రిలే దీక్షలు చేపట్టారు. 

అనంత‌పురం: 
వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన జ‌ల‌దీక్ష‌కు మ‌ద్ద‌తుగా జిల్లా అధ్య‌క్షుడు శంక‌ర్‌నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో జిల్లాలోని 63 కేంద్రాల్లో ధ‌ర్నాలు. తెలంగాణ ప్ర‌భుత్వం అక్ర‌మంగా నిర్మించే ప్రాజెక్టుల‌ను వెంట‌నే ఆపాల‌ని శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. పుట్ట‌ప‌ర్తి, క‌ళ్యాణ‌దుర్గంలో పార్టీ నేతల ఆధ్వర్యంలో రిలేదీక్షలు.  తాడిప‌త్రి, క‌దిరి, పెనుగొండ‌, గోరంట్ల‌, ప‌రిగి, హిందూపురం మండ‌ల కేంద్రాల్లో వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు ర‌మేష్‌రెడ్డి, న‌వీన్‌, ఆదిశేషూల ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న దీక్ష‌లు. అనంత‌పురం ఎమ్మెల్యే కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా చేసిన వైయస్సార్సీపీ నాయ‌కులు. ఉర‌వ‌కొండలో వైయస్సార్సీపీ  నాయ‌కులు, కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు.  ధ‌ర్మవ‌రంలో మాజీ ఎమ్మెల్యే వెంక‌ట్రామిరెడ్డి ఆధ్వ‌ర్యంలో మండ‌ల కేంద్రంలో రిలే దీక్షలు చేపట్టారు. 

వైయ‌స్సార్ జిల్లా...
తెలంగాణ చేప‌డుతున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌కు వ్య‌తిరేకంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన జ‌ల‌దీక్ష‌కు మ‌ద్ద‌తుగా... జిల్లాలోని పులివెందుల త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో ధ‌ర్నా చేసిన వైయ‌స్సార్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు. సంఘీభావం తెలిపిన ఎంపీ అవినాష్‌రెడ్డి.  క‌మ‌లాపురంలో ఎమ్మెల్యే ర‌వీంధ్ర‌నాథ్ ఆధ్వ‌ర్యంలో భారీ ధ‌ర్నా చేశారు. ఒంటిమిట్ట, ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్, వైయ‌స్సార్ సీపీ నాయ‌కుడు వేణుగోపాల్ ఆధ్వ‌ర్యంలో భారీ ధ‌ర్నా చేపట్టారు.

విజ‌య‌న‌గ‌రం: 
 వైయస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జ‌ల‌దీక్ష‌కు మ‌ద్ద‌తుగా విజ‌యన‌గ‌రంలో ఎమ్మెల్యే పుష్ప‌శ్రీ‌వాణి ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న రిలే దీక్ష‌లు. సాలూరు ఎమ్మార్వో కార్యాల‌యం ఎదుట ధర్నా చేప‌ట్టిన వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు ఈశ్వ‌ర్‌రావు. కురుపాంలో వైయస్ జ‌గ‌న్ జ‌ల‌దీక్ష‌కు మ‌ద్ద‌తుగా రిలే నిరాహార దీక్ష‌లు చేప‌ట్టిన వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు.

విశాఖ‌ప‌ట్నం:
వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జ‌ల‌దీక్ష‌కు మ‌ద్ద‌తుగా గాజువాక‌లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తిప్ప‌ల నాగిరెడ్డి ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న రిలే దీక్ష‌లు. విశాఖ‌ప‌ట్నం రూర‌ల్ ఎమ్మార్వో కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా చేప‌ట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు వంశీకృష్ణ, ప్ర‌సాద‌రెడ్డి, కార్య‌క‌ర్తలు. అన‌కాప‌ల్లిలో  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ జాన‌కీరామ‌రాజు ఆధ్వ‌ర్యంలో ఆర్డీవో ఎదుట ధ‌ర్నా చేప‌ట్టిన కార్య‌క‌ర్త‌లు. గొలుగొండ ఎమ్మార్వో కార్యాల‌యం ఎదుట దీక్ష చేప‌ట్టిన వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు ఉమాశంక‌ర్‌గ‌ణేష్. మ‌ద్ద‌తు తెలిపిన ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

తూర్పుగోదావ‌రి:
తూర్పుగోదావ‌రి జిల్లా రౌట్ల‌పూడి ఎమ్మార్వో కార్యాల‌యం ఎదుట వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జ‌ల‌దీక్ష‌కు మ‌ద్ద‌తుగా రిలే దీక్ష‌లు చేప‌ట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు. మండ‌ల ప‌రిధిలోని అన‌ప‌ర్తిలో సూర్య‌నారాయ‌ణ‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో  రిలేదీక్ష‌లు. గ‌న్న‌వ‌రంలో చిట్టిబాబు ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న రిలే దీక్ష‌లు. కాకినాడ ఎమ్మార్వో కార్యాల‌యంలో దీక్షలు చేప‌ట్టిన ముత్తాశ‌శిధ‌ర్‌రెడ్డి, ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు. 

To read this article in English:  http://bit.ly/1TH8MvE 

Back to Top