ప్రజల్లో నిలిచేది.. గెలిచేది వైయస్ఆర్‌సీపీయే

హైదరాబాద్ :

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ సర్వ సిద్ధంగా ఉందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. 'ప్రజల్లో నిలిచేది మేమే...గెలిచేది మేమే' అని ఆమె అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆమె బుధవారంనాడు మీడియాతో మాట్లాడారు.

వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అని పద్మ తెలిపారు. రానున్న ఎన్నికల్లో శ్రీ వైయస్ జగ‌న్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని‌ ఆమె అన్నారు. రాజన్న రాజ్యం స్థాపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. అన్ని సర్వేలు వైయస్ఆర్‌సీపీదే ప్రభంజనం అని చెబుతున్నాయని పద్మ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Back to Top