వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితాళ్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థిని పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ప్రకటించారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తూ నేతలు, కార్యకర్తలకు వైయస్‌ జగన్‌ పరిచయం చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీ క్రియాశీలక నేతగా ఎదిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ.. ఈ నెల 5న ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌ వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నారు.  ఈ నేపథ్యంలో తాళ్లూరుకు చేరుకున్న వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశమైన వైయస్‌ జగన్‌.. రామిరెడ్డిని పరిచయం చేశారు.  ఆయన అభ్యర్థిత్వాన్ని సభ్యులందరూ  ఆమోదించారు.
Back to Top