శాంతి భద్రతలపై అసెంబ్లీ లో వైఎస్సార్సీపీ ఆందోళన

హైదరాబాద్) రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మీద వైెఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో దీని మీద మాట్లాడారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళలపై పెరుగుతున్న నేరాల్ని ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ మ్యానిపెస్టోలో మహిళల భద్రత కోసం అనేక చర్యలు ప్రకటించారని గుర్తు చేశారు. ప్రత్యేక అధికారులు, ప్రత్యేక వ్యవస్థలు అంటూ చాలా కబుర్లు చెప్పారని, రెండేళ్లు గడుస్తున్నా ఏమాత్రం ప్రగతి కనిపించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పీడిగ రాజన్న దొర మాట్లాడుతూ.. గిరిజనుల భద్రత మీద ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులు, దళితుల భద్రతకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలోనే తన నియోజక వర్గమైన సాలూరులో జరిగిన పరిణామాల్ని ప్రస్తావించారు. జనవరిలో ఇద్దరు గిరిజనుల్ని సజీవ దహనం చేయటం, ఫిబ్రవరిలో ఒక గిరిజన మహిళ మీద లైంగిక దాడి జరగటం, ఇదే మార్చి నెలలో లైంగిక వేధింపులు జరిగినట్లు సభ ద్రష్టికి తీసుకొని వచ్చారు. ఒక్క తన నియోజక వర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏమిటని నిలదీశారు. 
దీనికి హోమ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమాధానం ఇచ్చారు. మామూలు జవాబు దోరణిలో చెప్పారు, తప్పితే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలకు మాత్రం వివరణ ఇవ్వకుండా ముగించారు. 
Back to Top