<br/>హైదరాబాద్) అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఉదయం వైఎస్సార్సీపీ సభ్యులు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఆస్పత్రుల సమస్యల విషయాల్ని ప్రస్తావించారు. ఏజన్సీ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత, మౌళిక వసతుల లేమిని శాసనసభ్యులు సర్వేశ్వర రావు, కళావతి తదితరులు ప్రస్తావించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్క స్పెషలిస్టు వైద్యుల నియామకం కూడా జరగలేదన్న సంగతి సభ దృష్టికి తీసుకొని వచ్చారు. దీనికి వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొంటున్నామని పొడి పొడిగా జవాబు ఇచ్చారు.