జూన్ 2న రైల్ రోకో

విశాఖపట్నంః టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు ఒక్క విభజన హామీ కూడా సాధించలేకపోయిందని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రత్యేకహోదా, రైల్వే జోన్ సహా ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అసమర్థత వల్లే విశాఖకు రైల్వే జోన్ రావడం లేదని ఆగ్రహించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అమర్నాథ్ మాట్లాడారు.         
                          
కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జూన్ 2న రైల్ రోకో చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుత వాతావరణంలో రైల్ రోకో కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అఖిలపక్ష నాయకులు, మేధావులు, విద్యార్థులు అందరినీ రైల్వే జోన్ సాధనలో భాగస్వాములు చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా విశాఖ సూపర్‌బజార్‌ కాలపరిమితిని పెంచుతూ ప్రభుత్వాధికారులు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం విశాఖ జిల్లా కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 

Back to Top