రాష్ట్ర‌వ్యాప్తంగా రైల్‌రోకోలు




- ప‌లు రైల్వే స్టేష‌న్ల‌లో ఉధృక్త‌త‌
- రైళ్ల‌ను అడ్డుకుంటున్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు
- నినాదాల‌తో హోరెత్తుతున్న రైల్వే స్టేష‌న్లు
అమ‌రావ‌తి:  ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం తీవ్ర‌రూపం దాల్చింది.  హోదా సాధనే ధ్యేయంగా ఎంపీ పదవులను త్యజించి ఆమరణ దీక్షకు దిగిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు సంఘీభావంగా బుధ‌వారం రాష్ట్ర‌వ్యాప్తంగా రైల్‌రోకో కార్య‌క్ర‌మాలు త‌ల‌పెట్టారు. అన్ని జిల్లాల‌లో పార్టీ శ్రేణులు రైళ్ల‌ను అడ్డుకొని ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్క అంటు నిన‌దిస్తున్నారు. ఉద్య‌మ‌కారుల నినాదాల‌తో రైల్వే స్టేష‌న్లు హోరెత్తుతున్నాయి. కాగా, చంద్ర‌బాబు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసుల‌తో ఉద్య‌మాన్ని అణ‌చివేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒంగోల్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ద‌ళిత నేత అశోక్‌బాబుపై పోలీసులు దౌర్జ‌న్యం చేశారు. బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలులో హాఫీజ్ ఖాన్, బీవై రామయ్య, ఎమ్మెల్యే ఐజయ్యలు రైలు రోకో నిర్వహించారు. వీరిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. తిరుప‌తిలో భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో రైల్ రోకో నిర్వ‌హించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్టారు. వైయ‌స్ఆర్ జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు రైల్ రోకో నిర్వ‌హించారు.  అనంత‌పురంలో వెంక‌ట్రామిరెడ్డి ఆధ్వ‌ర్యంలో చెన్నై- ముంబాయి ఎక్స్‌ప్రెన్‌ను ఆపేశారు. క‌ర్నూలులో బీవై రామ‌య్య ఆధ్వ‌ర్యంలో రైల్‌రోకో నిర్వ‌హించారు. గుంటూరు రైల్వే స్టేష‌న్‌, నెల్లూరు రైల్వే స్టేష‌న్‌లో ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో రైల్‌రోకో నిర్వ‌హించారు.

తాజా వీడియోలు

Back to Top