చంద్రబాబుకి వైయస్సార్సీపీ ప్రశ్నావళి.. మాజీమంత్రి బొత్స

హైదరాబాద్) మహా సంకల్పం
చేపట్టింది చంద్రబాబు, ఆయన కుటుంబం బాగు పడటానికా లేక, రాష్ట్రం బాగుపడటానికా అని
మాజీమంత్రి, వైయస్సార్సీపీ సీనియర్ నాయకులు బొత్సా సత్యనారాయణ ప్రశ్నించారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు చేసిన మోసాలపై వైయస్సార్సీపీ తరపున 10 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ఆయన
విడుదల చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను
తప్పారా లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, పోలవరం వంటి ప్రయోజన కర అంశాల మీద
ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు.

 

Back to Top