జనసంద్రమైన ఎస్పీజీ గ్రౌండ్

కర్నూలుః నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ జ‌న‌సంద్రమైంది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ల‌పెట్టిన భారీ బ‌హిరంగ స‌భ‌కు జనం పోటెత్తారు. బ‌హిరంగ స‌భ‌ను భ‌గ్నం చేయాల‌ని టీడీపీ ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా  అంత‌కు రెట్టింపు జ‌నాలు బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. దీంతో, అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టాయి. కాసేప‌ట్లో వైయ‌స్ జ‌గ‌న్ స‌భా ప్రాంగ‌ణానికి చేరుకోనున్నారు. స‌భా ప్రాంగ‌ణ‌మంతా `జై జ‌గ‌న్‌.. జోహ‌ర్ వైయ‌స్ఆర్‌` నినాదాల‌తో మార్మోగుతుంది. ఎస్పీజీ మైదానంలోని బ‌హిరంగ స‌భ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్  ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టారు. దీంతో, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

Back to Top