జడ్పీ సమావేశంలో వైయస్సార్సీపీ సభ్యుల నిరసన

శ్రీకాకుళం:  శ్రీకాకుళం జిల్లా ప‌రిష‌త్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం లో టీడీపీ
దౌర్జన్యాలు బయట పడ్డాయి. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల గురించి స‌మాచారం త‌మ‌కు ఇవ్వ‌డం లేద‌ని
వైయ‌స్ఆర్సీపీ నాయ‌కులు అధికారుల‌ను ప్ర‌శ్నించారు. అంతేకాకుండా ప్ర‌భుత్వ
అధికారులు ప్రోటోకాల్ పాటించ‌కుండా రాజ్యంగేత‌ర శ‌క్తుల‌కు ప్రాధాన్య‌త
ఇస్తున్నారని క‌లెక్ట‌ర్‌పై మండిప‌డ్డారు. స‌భ‌లో ప్ర‌తిప‌క్ష స‌భ్యులు లేవ‌నెత్తిన
అంశాల‌కు స‌మాధానం ఇవ్వ‌కుండా మంత్రి అచ్చెన్నాయుడు  ఏక‌వ‌చ‌నంతో సంభోధించారు. దీంతో  వైయ‌స్ఆర్సీపీ స‌భ్యులు జోగులు, క‌ళావ‌తి, ధ‌ర్మాస‌న ప‌ద్మ‌ప్రియ స‌మావేశం నుంచి వాకౌట్
చేశారు. ఎమ్మెల్యేలు,
జ‌డ్పీటీసీలు
 స‌మావేశ మందిరం వ‌ద్ద బైఠాయించి నిర‌స‌న తెలిపారు.

 

Back to Top